Bhatti Vikramarka: రాముడి పేరిట రాజకీయాలొద్దు.. బీజేపీపై భట్టి విక్రమార్క ఫైర్
ABN, Publish Date - Jan 29 , 2024 | 09:52 PM
రాముడి పేరిట రాజకీయాలొద్దని.. రాముడు అందరికీ దేవుడు... తమకు కూడా దేవుడేనని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka) అన్నారు. మత విభజన పేరిట వైశమ్యాలు సృష్టించొద్దని అన్నారు.
హైదరాబాద్: రాముడి పేరిట రాజకీయాలొద్దని.. రాముడు అందరికీ దేవుడు... తమకు కూడా దేవుడేనని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka) అన్నారు. సోమవారం నాడు గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మత విభజన పేరిట వైశమ్యాలు సృష్టించొద్దని అన్నారు. వీధి రౌడీల్లా మాట్లాడటమే బీఆర్ఎస్ నేతల సంస్కారమా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను నిజం చేయడానికి కసరత్తు చేస్తున్నారని తెలిపారు.
ప్రజల సమస్యల పరిష్కారమే ఇందిరమ్మ రాజ్యం ఎజెండా అని చెప్పారు. మతం పేరిట అలజడి సృష్టించే ఆటలను సాగనివ్వబోమని హెచ్చరించారు. చేసిన అభివృద్ధి ఏంటో చెప్పి పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టేనని విమర్శించారు. విద్యుత్తు సరఫరాపై తప్పుడు ప్రచారం మానుకోకుంటే ప్రజలే బుద్ది చెబుతారని హెచ్చరించారు. గతేడాది కంటే ఈ ఏడాది ఎక్కువ విద్యుత్తు సరఫరా చేశామని తెలిపారు. రాబోయే వేసవిలో విద్యుత్తు కొరతలు లేకుండా సరఫరా చేస్తామన్నారు. తప్పుడు వదంతులను నమ్మొద్దని భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు.
Updated Date - Jan 29 , 2024 | 09:52 PM