Congress: కేటీఆర్, హరీష్ రావుల వ్యాఖ్యలు వాళ్ల అహంకారానికి పరాకాష్ట: మల్లు రవి
ABN, Publish Date - Jan 29 , 2024 | 01:57 PM
హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రభుత్వ అధికార ప్రతినిధి మల్లు రవి అన్నారు.
హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రభుత్వ అధికార ప్రతినిధి మల్లు రవి అన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ కాలి గోటికి కూడా రేవంత్ రెడ్డి సరిపొరని అంటూ కేటీఆర్ మాట్లాడిన మాటలు ఆయన అహంకారానికి పరాకాష్ట అని అన్నారు. ప్రజలు తీర్పు ఇస్తే ప్రజాస్వామ్య బద్దంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి రాష్ట్రంలో విప్లవాత్మక పాలన చేస్తున్నారని అన్నారు. ప్రజా రంజకంగా, ప్రజా పాలన చేస్తూ ప్రజల మనసులలో స్థానం సంపాదించారన్నారు.
ప్రజాభిమానంతో సీఎంగా పని చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల కేటీఆర్ ఇలా అనుచితంగా మాట్లాడ్డం ప్రజలను అవమానించడమే అవుతుందని మల్లు రవి అన్నారు. ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడితే ప్రజలు తిరగబడుతారన్నారు. హరీష్ రావు ముఖ్యమంత్రికి హుందాతనం లేదని అనడం ఆయన అహంకారానికి పరాకాష్ట అన్నారు. ప్రజలకు మరింత చేరువుగా ఉంటూ ప్రజా పాలన చేస్తూ హుందాగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డిని ఇలా అనడం పద్దతి కాదని, కేటీఆర్, హరీష్ రావు వారి పద్దతి మార్చుకోవాలని మల్లు రవి హితవుపలికారు.
Updated Date - Jan 29 , 2024 | 01:59 PM