ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: సినీ నటిని బురిడీ కొట్టించిన సైబర్ కేటుగాళ్లు..

ABN, Publish Date - Dec 17 , 2024 | 04:29 PM

ఓ సినీనటిని సైబర్ కేటుగాళ్లు బురిడీ కొట్టించారు. ఆమె నుంచి వేల రూపాయలు స్వాహా చేశారు. అప్రమత్తమైన బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది.

Cyber Crime

హైదరాబాద్: దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు (Cyber Crime) పెరిగిపోతున్నాయి. కళ్లు మూసి తెరిచే లోపే బ్యాంకు ఖాతాల్లోని నగదును కేటుగాళ్లు ఇట్టే మాయం చేస్తున్నారు. లక్కీ డ్రాలు, బ్యాంక్ ఖాతా అప్డేట్, స్టాక్ మార్కెట్ పెట్టుబడులు, మీ పేరు మీద పార్శిల్ వచ్చిందంటూ అనేక రకాలుగా అమాయకులను బురిడీ కొట్టిస్తారు. వారి చేతుల్లో మోసపోయి వేలు, లక్షలే కాదు ఒక్కోసారి కోట్ల రూపాయలు సైతం ప్రజలు పోగొట్టుకుంటున్నారు. అయితే ఇందులో సామాన్య ప్రజలే కాదు.. విద్యావంతులు, రాజకీయ నాయకులు, నటీనటులు, ప్రముఖులు సైతం ఉంటున్నారు.


తాజాగా అటువంటి ఘటనే ఒకటి హైదరాబాద్ (Hyderabad) నగరంలో చోటు చేసుకుంది. ఓ సినీనటిని సైబర్ కేటుగాళ్లు బురిడీ కొట్టించారు. ఆమె నుంచి వేల రూపాయలు స్వాహా చేశారు. అప్రమత్తమైన బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ కుందన్‌బాగ్‌ ప్రాంతంలో సినీ నటి మహిమా గౌర్ (Mahima Gour) నివాసం ఉంటోంది. ఈమె మంచు విష్ణు హీరోగా నటించిన మోసగాళ్లు సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా చేశారు. అయితే ఈనెల 6వ తేదీన రంజన్‌ షాహీ అనే వ్యక్తి నుంచి మహిమాకు ఫోన్ వచ్చింది. తాను ఓ సినీ నిర్మాతనంటూ అతను పరిచయం చేసుకున్నాడు. అనంతరం కాసేపటి తర్వాత రంజన్ షాహీ పేరు చెప్తూ అనిత అనే మహిళ మహిమాకు ఫోన్ చేసింది. తాను సినీ అండ్‌ టీవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(సింటా)లో హెచ్‌ఆర్‌ డైరెక్టర్‌నంటూ పరిచయం చేసుకుంది.


అయితే రూ.50,500లు చెల్లిస్తే సింటాలో జీవితకాలం పని చేసే కార్డును అందిస్తానని మహిమాకు అనిత తెలిపింది. ఆమె మాటలు నమ్మిన నటి మూడు దఫాలుగా నగదు చెల్లించింది. అయినప్పటికీ అనిత ఇంకా నగదు ఇవ్వాలంటూ మరోసారి ఫోన్ చేసింది. అనుమానం వచ్చిన మహిమా వెంటనే సైబర్‌ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1930కు ఫోన్ చేసి విషయం చెప్పింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మహిమా ఖాతా నుంచి రూ.20,200 సైబర్‌ కేటుగాళ్ల చేతుల్లోకి వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. నటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు. అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్, మెయిల్స్‌కు స్పందించవద్దని పోలీసులు చెప్తున్నారు. ముఖ్యంగా నగదు చెల్లింపుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. సైబర్ మోసాలు పెరిగిపోయాయని వాటి పట్ల అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Seethakka: బీఆర్‌ఎస్ నేతల నిరసనపై సీతక్క ఇంట్రెస్టింగ్ కామెంట్స్

HYDRA: హైడ్రా కీలక ప్రకటన.. ఆ ఇళ్లను కూల్చబోమంటూ..

Updated Date - Dec 17 , 2024 | 04:48 PM