ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Mandakrishna: గతంలో చంద్రబాబు ఎస్సీ వర్గీకరణ అమలు చేశారు..

ABN, Publish Date - Aug 10 , 2024 | 01:17 PM

న్యూఢిల్లీ: ఎస్సీ వర్గీకరణ తీర్పు రాగానే దక్షణాది రాష్ట్రాలకు చెందిన నలుగురు ముఖ్యమంత్రులు అమలు చేస్తామని చెప్పారని, గతంలో నారా చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణ అమలు చేశారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అన్నారు.

న్యూఢిల్లీ: ఎస్సీ వర్గీకరణ (SC Classification) తీర్పు రాగానే దక్షణాది రాష్ట్రాలకు చెందిన నలుగురు ముఖ్యమంత్రులు (Four Chief Ministers) అమలు చేస్తామని చెప్పారని, గతంలో నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఎస్సీ వర్గీకరణ అమలు చేశారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు (MMRPSb Founder) మందకృష్ణ మాదిగ (Mandakrishna Madiga) అన్నారు. ఈ సందర్బంగా శనివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ శుక్రవారం జరిగిన టీడీపీ పోలిట్‌బ్యూరో సమావేశంలో కూడా ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారని సంతోషం వ్యక్తం చేశారు. ఆయనను కలిసి ధన్యవాదాలు తెలుపుతామన్నారు. విదేశీ పర్యటన నుంచి రాగానే సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిసి ధన్యవాదాలు చెబుతామని మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు.


మోదీ, అమిత్ షా తో మందకృష్ణ భేటీ..

కాగా మందకృష్ణ మాదిగ శుక్రవారం రాత్రి ఢిల్లీలో ప్రధాని మోదీ (PM Modi), హోంమంత్రి అమిత్ షా (Amit Shah)ను మర్యాదపూర్వకంగా కలిసారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు (Supreme Court) అనుకూలంగా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో వారిని కలిసారు. . దాదాపు 30 నిమిషాలపాటు ప్రధానితో భేటీ అయిన మందకృష్ణ ఎస్సీ వర్గీకరణకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే, మంద కృష్ణను ఆప్యాయంగా పలకరించి హత్తుకున్న ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ. తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ త్వరితగతిన అమలు అయ్యేలా చూడాలని కోరారు. వర్గీకరణ అంశంపై కొందరు సుప్రీం కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్న నేపథ్యంలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలని అన్నారు.


సుప్రీం తీర్పు..

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉప వర్గీకరణ చేసే అధికారం.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. 6:1 మెజారిటీతో సీజేఐ జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పును వెల్లడించింది. ఈనెల 1న (గురువారం) వర్గీకరణపై సుదీర్ఘ విచారణ జరిపిన ఏడుగురు సభ్యుల ధర్మాసనం.. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ సమర్థనీయమని స్పష్టం చేసింది. కాగా.. ఈ వర్గీకరణను మెజారిటీ సభ్యులు సమర్థించగా.. జస్టిస్‌ బేలా త్రివేది మాత్రం వ్యతిరేకించారు. ఎస్సీలు చాలా వెనుకబడిన వర్గాలుగా ఉన్నారని.. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల వర్గీకరణ అవసరం ఉందని.. వర్గీకరణచేసే వెసులుబాటు రాష్ట్రాలకు ఉండాలని సుప్రీం స్పష్టం చేసింది. ఈ మేరకు 2004లో ఐదుగురు సభ్యులు ఇచ్చిన తీర్పును తాజా తీర్పు తర్వాత ధర్మాసనం పక్కనబెట్టింది. ఈ తీర్పును అనుసరించి తదుపరి మార్గదర్శకాలను అనుసరించాలని ప్రభుత్వాలకు న్యాయస్థానం సూచించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

ట్రాఫిక్ కష్టాలు.. పోలీసుల సరికొత్త ప్రయోగం..

ఆదివాసీ దినోత్సవంలో గిరిజనులతో సీఎం చంద్రబాబు..

ఏపీ మహిళలకు శుభవార్త...

దమ్ముంటే చంపు.. బయటకు రా..: దువ్వాడ వాణి

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Aug 10 , 2024 | 01:18 PM

Advertising
Advertising
<