ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TS Assembly: అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్న మార్షల్స్

ABN, Publish Date - Feb 14 , 2024 | 02:16 PM

Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను మార్షల్స్ అడ్డుకున్నారు. సభ నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యేలు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్దకు మాట్లాడేందుకు వెళ్తుండగా మార్షల్స్ అభ్యంతరం తెలిపారు.

హైదరాబాద్, ఫిబ్రవరి 14: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వ్యాఖ్యలకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను (BRS MLAs) మార్షల్స్ అడ్డుకున్నారు. సభ నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యేలు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్దకు మాట్లాడేందుకు వెళ్తుండగా మార్షల్స్ అభ్యంతరం తెలిపారు. అసెంబ్లీ నడుస్తున్నప్పుడు మీడియా పాయింట్‌లో ప్రెస్‌మీట్స్‌కు అవకాశం లేదని అసెంబ్లీ భద్రతా సిబ్బంది తెలిపారు. కొత్త నిబంధనలు ఏంటంటూ సిబ్బందితో ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్‌రావు వాగ్వాదానికి దిగారు. అయితే గతంలో నుంచే ఈ నిబంధనలు ఉన్నాయని అసెంబ్లీ సిబ్బంది తెలిపారు.

దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఖూనీ చేస్తోందని నిరసనకు దిగారు. మీడియా పాయింట్‌కు వెళ్ళే మార్గంలో కింద కూర్చుని ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ లోపల మాట్లాడటానికి అవకాశం ఇవ్వరని... అసెంబ్లీ బయట కూడా మీడియాతో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వరా అంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నినదిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 14 , 2024 | 02:57 PM

Advertising
Advertising