GHMC: ఎంఐఎం ఎమ్మెల్సీపై పీఎస్‌లో ఫిర్యాదు చేసిన మేయర్
ABN, Publish Date - Nov 26 , 2024 | 10:01 PM
ఇటీవల జీహెచ్ఎంసీ మేయర్ ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి పాత బస్తీలోని హోటళ్లు, రెస్టారెంట్లు, మాంసం దుకాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చికెన్ తింటున్న ఎలుకలను చూసి సాక్షాత్తు మేయర్ అవాక్కయ్యారు.
హైదరాబాద్, నవంబర్ 26: హైదరాబాద్ మహానగరంలోని బస్తా బస్తీలో ఫుడ్ సేఫ్టీ అధికారులు చేపట్టిన దాడులు పొలిటికల్ టర్న్ తీసుకున్నాయి. ఆ క్రమంలో మజ్లీస్ ఎమ్మెల్సీ వర్సెస్ జీహెచ్‌ఎంసీ మేయర్ అన్నట్లుగా పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఎంఐఎం ఎమ్మెల్సీ రహమత్ బేగ్‌పై మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం కోఠిలోని మోతీ మార్కెట్‌ను ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆ క్రమంలో సదరు మార్కెట్‌ను ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేశారు. అయితే ఆ తాళాలు పగలగొట్టిన మార్కెట్ తెరవడంపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ సీరియస్ అయ్యారు.
Also Read: మళ్లీ భారీ అగ్నిప్రమాదం
Also Read: సీఎం రేవంత్ భేటీ.. అనంతరం కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు
మోతీ మార్కెట్ తాళాలు తీయకుంటే.. ఉద్యోగాలు పోతాయంటూ సేఫ్టీ అధికారులను ఎంఐఎం నేతలు బెదిరించడంపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల విధులకు ఆటంకం కలిగించారంటూ ఎమ్మెల్సీ బేగ్ పై ఆమె కాచిగుడా పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. సీజ్ చేసిన మాంసాన్ని సైతం లాక్కొని, నోటీసులు సైతం చింపి వేయడంపై మేయర్ విజయలక్ష్మీ మండిపడినట్లు సమాచారం. అదీకాక మరోసారి తమ దుకాణాలపై దాడులు చేస్తే చర్యలు తప్పవంటూ ఆయన హెచ్చిరించినట్లు తెలుస్తుంది.
Also Read రాగల 24 గంటల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు
Also Read: రూ. 24 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
ఇటీవల జీహెచ్ఎంసీ మేయర్ ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి పాత బస్తీలోని హోటళ్లు, రెస్టారెంట్లు, మాంసం దుకాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చికెన్ తింటున్న ఎలుకలను చూసి సాక్షాత్తు మేయర్ అవాక్కయ్యారు. అలాగే పలు చికెన్ షాపుల్లో సైతం చనిపోయిన కోళ్లను విక్రయిస్తున్నట్లు మేయర్ గుర్తించారు. దీంతో షాపుల యజమానులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: ఏపీలో ఎన్నికలు.. నోటిఫికేషన్ విడుదల
ఆ క్రమంలో కుళ్లిన చికెన్ విక్రయిస్తున్న వారిపై చర్యల తీసుకోవాలని ఫుడ్ సేఫ్టీ అధికారులను ఆమె ఆదేశించారు. దీంతో పలు దుకాణాలను అధికారులు మూసివేశారు. అయితే 24 గంటల్లోనే ఆ షాపుల వ్యాపారులు తిరిగి తెరిచారు. కనీసం ఫుడ్ సేఫ్టీ అధికారులకు పెనాల్టీలు సైతం వారు చెల్లించలేదు. దీనిపై ఉన్నతాధికారులను మేయర్ ఆరా తీశారు. ఈ నేపథ్యంలో ఎంఐఎం ఎమ్మెల్సీ బెదిరింపులు వెలుగులోకి వచ్చాయి.
Also Read: మున్సిపల్ కమిషనర్ నివాసంపై ఏసీబీ దాడి.. కీలక పత్రాలు స్వాధీనం
For Telangana News And Telugu News
Updated Date - Nov 26 , 2024 | 10:01 PM