Minister Komati Reddy: జగదీష్ రెడ్డి జైలుకు పోవడం ఖాయం
ABN, Publish Date - Jan 23 , 2024 | 03:13 PM
మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి జైలుకు పోవడం ఖాయమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ( Minister Komati Reddy Venkat Reddy ) హెచ్చరించారు. కాళేశ్వరంతో పాటు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల్లో చోటుచేసుకున్న అక్రమాలపై విచారణ కొనసాగుతుందని చెప్పారు.
హైదరాబాద్: మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి జైలుకు పోవడం ఖాయమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ( Minister Komati Reddy Venkat Reddy ) హెచ్చరించారు. కాళేశ్వరంతో పాటు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల్లో చోటుచేసుకున్న అక్రమాలపై విచారణ కొనసాగుతుందని చెప్పారు. మంగళవారం నాడు గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... తాము ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను త్వరలోనే నెరవేరుస్తామని చెప్పారు. హామీల అమలుపై నేడు రివ్యూ చేశామన్నారు. వంద రోజుల్లో హామీలను అమలు చేసి తీరుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు.. వచ్చే నెల నుంచి ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీ అమలవుతుందని చెప్పారు. కేసీఆర్ సర్కార్ నిర్వాకం వల్ల రాష్ట్రం గుల్ల అయ్యిందని.. అందుకే హామీల్లో కాస్త జాప్యం జరుగుతోందన్నారు. నిరుద్యోగ భృతి మొదలుకుని డబుల్ బెడ్ రూం ఇళ్ల వరకు అన్ని హామీలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతల్లాగా ప్రజలను తాము రెచ్చగొడితే.. ఫార్మ్ హౌస్ దాటకపోయే వారని హెచ్చరించారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఒక్క సీటు కూడా రాదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
Updated Date - Jan 23 , 2024 | 03:13 PM