Ponnam: క్రీడారంగంలో తెలంగాణ నెంబర్ 1లో ఉండాలి
ABN, Publish Date - Aug 26 , 2024 | 03:16 PM
Telangana: ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో నగరంలోని ఎల్బీ స్టేడియంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, స్పోర్ట్స్ సలహాదారుడు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నేషనల్ స్పోర్ట్స్ డే పోస్టర్‌ను , టీ షర్ట్‌ను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు.
హైదరాబాద్, ఆగస్టు 26: ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో నగరంలోని ఎల్బీ స్టేడియంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Legislative Assembly Speaker Gaddam Prasad Kumar), రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar), స్పోర్ట్స్ సలహాదారుడు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నేషనల్ స్పోర్ట్స్ డే పోస్టర్‌ను , టీ షర్ట్‌ను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు.
Narayana: సీఎం రేవంత్ జైలుకు వెళ్లే ప్రమాదం.. నారాయణ హాట్ కామెంట్స్
అనంతరం మంత్రి పొన్నం మాట్లాడుతూ... 29 న ధ్యాన్ చంద్ జన్మదినం సందర్భంగా స్పోర్ట్స్ డేలో భాగంగా పోస్టర్, లోగో ఆవిష్కరించడం జరిగిందన్నారు. ధ్యాన్ చంద్ జన్మదినం సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా క్రీడలను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన అని అన్నారు. ఇటీవల కొరియా దేశం వెళ్ళినప్పుడు అక్కడ క్రీడా సంస్థలు క్రీడాకారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసిన తరువాత తెలంగాణలో కూడా స్పోర్ట్స్ యూనివర్శిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ప్రకటించారన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి తెలంగాణలో ప్రజా పాలనలో క్రీడాకారులను వారి నైపుణ్యాలను బయటకు తెచ్చే విధంగా ప్రభుత్వం సంకల్పం తీసుకుందని.. అందులో భాగంగా జాతీయ క్రీడా దినోత్సవం కార్యక్రమంలో పోస్టర్ ఆవిష్కరణ జరిగిందన్నారు.
HYDRAA: దడ పుట్టిస్తున్న హైడ్రా నాన్‌స్టాప్ కూల్చివేతలు..
భవిష్యత్‌లో రాష్ట్రం క్రీడా రంగంలో నంబర్ 1గా ఉండాలని ఆకాంక్షించారు. భవిష్యత్‌లో పాఠశాల దశ నుండి క్రీడల్లో రాణించేలా ప్రోత్సహించాలనే ప్రయత్నంలో భాగంగా క్రీడా దినోత్సవం ఘనంగా జరపాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. మంత్రులు ,ఎమ్మేల్యేలు , ప్రభుత్వ అధికారులంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.29న గచ్చిబౌలి స్టేడియంలో జరిగే కార్యక్రమంలో సీఎం రేవంత్.. ధ్యాన్ చంద్ విగ్రహానికి పూలమాల వేస్తారన్నారు. అన్ని జిల్లాల్లో క్రీడా దినోత్సవ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేసిన తల్లిదండ్రుల స్పందన ముఖ్యమన్నారు. పిల్లలను ప్రోత్సహించాలని తెలిపారు. శివసేన రెడ్డి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అయ్యారని... స్పోర్ట్స్ కోసం పెద్ద ఎత్తున నిధుల కేటాయింపు జరుగుతోందన్నారు. కరీంనగర్‌లో కూడా స్పోర్ట్స్ స్కూల్ ఉందన్నారు.స్పోర్ట్స్ కార్యక్రమానికి తెలంగాణ సమాజం మద్దతు ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు.
Updated Date - Aug 26 , 2024 | 03:41 PM