Seethakka: 5 కోట్లతో కడెం ప్రాజెక్టుకు తాత్కాలిక మరమ్మత్తులు
ABN, Publish Date - Jan 10 , 2024 | 09:27 PM
ప్రస్తుతం 5 కోట్లతో కడెం ప్రాజెక్టు తాత్కాలిక మరమ్మత్తులు చేపడుతున్నామని మంత్రి సీతక్క ( Minister Seethakka ) తెలిపారు. బుధవారం నాడు కడెం ప్రాజెక్టును మంత్రి సీతక్క, ఎమ్మెల్యే బొజ్జు పటేల్ సందర్శించి పరిశీలించారు.
నిర్మల్ జిల్లా: ప్రస్తుతం 5 కోట్లతో కడెం ప్రాజెక్టు తాత్కాలిక మరమ్మత్తులు చేపడుతున్నామని మంత్రి సీతక్క ( Minister Seethakka ) తెలిపారు. బుధవారం నాడు కడెం ప్రాజెక్టును మంత్రి సీతక్క, ఎమ్మెల్యే బొజ్జు పటేల్ సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ... కడెం ప్రాజెక్టుపై త్వరలో పూర్తిస్థాయిలో ఎస్టిమేషన్ వేసి సీఎం దృష్టికి తీసుకువెళ్లి రైతులకు రెండు పంటల సాగుకు నీరు అందే విధంగా కడెం ప్రాజెక్టును తీర్చిదిద్దుతామని తెలిపారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే కడెం ప్రాజెక్టు పరిస్థితి ఈ విధంగా తయారయిందని చెప్పారు. ఈ ఒక్క సంవత్సరం కడెం ఆయకట్టు రైతులకు క్రాప్ హాలిడే ప్రకటించినట్లు తెలిపారు. తాత్కాలిక మరమ్మతులు త్వరలో ప్రారంభిస్తామని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
Updated Date - Jan 10 , 2024 | 09:29 PM