ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Minister Seethakka: మేడారం జాతరకు రాష్ట్రపతి ముర్ముకు ఆహ్వానం

ABN, Publish Date - Feb 05 , 2024 | 10:02 PM

ఈసారి జాతరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి కూడా ఆహ్వానం అందించామని.. రాష్ట్రపతి వస్తారని భావిస్తున్నామని మంత్రి సీతక్క(Minister Seethakka) తెలిపారు. సోమవారం నాడు మేడారంలో మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ పర్యటించారు.

ములుగు: ఈసారి జాతరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి కూడా ఆహ్వానం అందించామని.. రాష్ట్రపతి వస్తారని భావిస్తున్నామని మంత్రి సీతక్క(Minister Seethakka) తెలిపారు. సోమవారం నాడు మేడారంలో మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ పర్యటించారు. మేడారం జాతరకు వచ్చే ఆర్టీసీ బస్సుల పార్కింగ్ ప్రదేశాలను మంత్రులు పరిశీలించారు. పార్కింగ్ ప్రదేశాల నుంచి అమ్మవారి దేవాలయం వరకు ఆర్టీసీ బస్సులో మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ ప్రయాణం చేశారు. మేడారం జాతరకు వచ్చే బస్సులు, వెళ్లే పార్కింగ్ స్థలాలు, బస్ షెల్టర్లు , క్యూలైన్ వార్డులు, ఆర్టీసీ ఉద్యోగుల షెల్టర్లు మంత్రులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఇతర ఉన్నతాధికారులు వివరించారు.

అనంతరం సమక్క సారలమ్మలకు నిలువెత్తు బంగారాన్ని మంత్రులు సమర్పించారు. అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ.. మేడారం జాతరకు జాతీయ హోదా దక్కుతుందని ఆశిస్తున్నామని తెలిపారు. 21 వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జాతర జరుగుతుందని.. ఆ నాలుగు రోజులే దేవతలు గద్దెలపై కొలువై ఉంటారని చెప్పారు. బహుశా దేశంలో ఎలాంటి టిక్కెట్ లేని దేవాలయం ఇదొక్కటే అని చెప్పారు. కుల, మత వివక్షత లేదు... అందరూ వన దేవతలను దర్శించుకోవచ్చని తెలిపారు. జాతర పనుల్లో నిర్లక్షం వహించిన కాంట్రక్టర్ల ను పక్కన పెట్టామని చెప్పారు.గత జాతరలో 2800 బస్సులు మాత్రమే నడిపారని... ఈసారి 6000 బస్సులు నడుపుతున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు.

Updated Date - Feb 05 , 2024 | 10:02 PM

Advertising
Advertising