మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

MLC Jeevan Reddy: రేవంత్ మొగోడు.. ఎంత మంది ఒక్కటైనా ఏం చేయలేరు

ABN, Publish Date - Mar 07 , 2024 | 01:17 PM

బీఆర్ఎస్ నేతలు మా మధ్య పుల్లలు పెడుతున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. నేడు ఆయన గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. ఆడ బిడ్డలందరికీ ప్రతీక సీతక్క అన్నారు. సీతక్క అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పోర్ట్ ఫోలియో నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ కమీషన్లలో కేంద్రానికి వాటా ఉందన్నారు.

MLC Jeevan Reddy: రేవంత్ మొగోడు.. ఎంత మంది ఒక్కటైనా ఏం చేయలేరు

హైదరాబాద్: బీఆర్ఎస్ నేతలు మా మధ్య పుల్లలు పెడుతున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (MLC Jeevan Reddy) పేర్కొన్నారు. నేడు ఆయన గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. ఆడ బిడ్డలందరికీ ప్రతీక సీతక్క (Seethakka) అన్నారు. సీతక్క అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పోర్ట్ ఫోలియో నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. మాజీ సీఎం కేసీఆర్ (KCR) కమీషన్లలో కేంద్రానికి వాటా ఉందన్నారు. తెలంగాణ ఆత్మ గౌరవానికి బ్రాండ్ అంబాసిడర్ మా రేవంత్ అని జీవన్ రెడ్డి (Jeevan Reddy) పేర్కొన్నారు. ఎవరెవరు ఒక్కటైనా రేవంత్‌ (Revanth Reddy)ని ఏం చేయలేరని జీవన్ రెడ్డి అన్నారు. కేసీఅర్ అవినీతిని ప్రోత్సహించిందే బీజేపీ అని పేర్కొన్నారు. అనుమతుల్లేని ప్రాజెక్టులకు కేంద్రం అప్పు ఇచ్చిందంటే అర్థం చేసుకోవచ్చన్నారు. అయ్యాకొడుకులు మోదీ ముందు మోకరిల్లారన్నారు. రేవంత్ మొగోడు అని పేర్కొన్నారు.

కృష్ణా జలాలను కేసీఆర్ తన మిత్రుడు జగన్ (CM Jagan)కి తాకట్టు పెట్టాడన్నారు. నోటిఫికేషన్లు ఇచ్చింది.. దానికి ఆటంకాలు తెచ్చింది కేసీఆరేనని పేర్కొన్నారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టింది కేసీఆరేనన్నారు. తెలంగాణకి ఏం కావాలని ప్రధాని (PM Modi) అడిగితే... మాకేం వద్దని కేసీఆర్ అన్నారని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. తన కొడుకును ముఖ్యమంత్రిని చేయడానికి సహకరించమని కోరినప్పుడు ఆత్మ గౌరవం ఏమయిందని తెలిపారు. కేసీఆర్ అవినీతిని కప్పి పుచ్చుకునేందుకు మోదీతో కేసీఆర్ సఖ్యతగా ఉన్నారన్నారు. విభజన చట్టంలోని హామీలను కేసీఆర్ తేవడంలో విఫలం అయ్యారని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. కమీషన్ల కోసం కక్కుర్తి పడేవాళ్లు కూడా ఆత్మ గౌరవం గురించి మాట్లాడుతున్నారన్నారు. ఉత్తర తెలంగాణ ప్రజల చిరకాల కలను రేవంత్ తీరుస్తున్నారన్నారు. వైట్ రేషన్ కార్డు ఉండి, 200 యూనిట్లకు మించినా ఉచిత కరెంట్ ఇస్తామని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.

MLC Kavitha: లిక్కర్ కేసు...పెద్ద కేసు కాదు: ఎమ్మెల్సీ కవిత

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 07 , 2024 | 01:17 PM

Advertising
Advertising