పేదల ఆకలి తీర్చిన మోదీ : గవర్నర్ రాధాకృష్ణన్
ABN, Publish Date - Jun 12 , 2024 | 04:49 AM
పేదల ఆకలి తీర్చిన నాయకుడు మోదీ అని.. ప్రజా సేవలో అబ్రహం లింకన్, మోదీ తమదైన ముద్ర వేశారని గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ అన్నారు. సిద్దిపేట జిల్లా ములుగులోని కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీలో మంగళవారం జరిగిన వర్సిటీ మూడో స్నాతకోత్సవంలో రాధాకృష్ణన్ మాట్లాడారు.
గజ్వేల్/ములుగు, జూన్ 11: పేదల ఆకలి తీర్చిన నాయకుడు మోదీ అని.. ప్రజా సేవలో అబ్రహం లింకన్, మోదీ తమదైన ముద్ర వేశారని గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ అన్నారు. సిద్దిపేట జిల్లా ములుగులోని కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీలో మంగళవారం జరిగిన వర్సిటీ మూడో స్నాతకోత్సవంలో రాధాకృష్ణన్ మాట్లాడారు. 2047 వరకు భారత స్థూల జాతీయోత్పత్తి 30 ట్రిలియన్ డాలర్లకు ఎదిగేందుకు పుష్కల అవకాశాలు ఉన్నాయని, అందులో యువత కీలకపాత్ర పోషించాలన్నారు. స్నాతకోత్సవంలో 156 మందికి ఉద్యాన డిగ్రీ, 50 మందికి ఫారెస్ట్ డిగ్రీ, 45 మందికి ఉద్యాన పీజీ, 30 మందికి ఫారెస్ట్ పీజీ, ఆరుగురికి పీహెచ్‌డీ పట్టాలను అందజేశారు.
Updated Date - Jun 12 , 2024 | 08:06 AM