Nampalli Court: కొండా సురేఖకు నాంపల్లి కోర్టు నోటీసులు
ABN, Publish Date - Oct 10 , 2024 | 02:31 PM
Telangana: మంత్రి కొండాసురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాంటూ ఈనెల 8న కోర్టును నాగార్జున కోరారు. అలాగే వాంగ్మూలం కూడా ఇచ్చారు. సాక్షిగా సుప్రియ వాంగ్మూలాన్ని కోర్టు రికార్డు చేసుకుంది. ఆపై ఈరోజుకు విచారణను వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు ఈరోజు (గురువారం) మరోసారి విచారణ జరిపింది.
హైదరాబాద్, అక్టోబర్ 10: మంత్రి కొండా సురేఖకు (Minister Konda Surekha) నాంపల్లికోర్టు నోటీసులు జారీ చేసింది. తన కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై హీరో నాగార్జున (Hero Nagarjuna) నాంపల్లి కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాంటూ ఈనెల 8న కోర్టును కోరారు నాగార్జున. అలాగే వాంగ్మూలం కూడా ఇచ్చారు. సాక్షిగా సుప్రియ వాంగ్మూలాన్ని కోర్టు రికార్డు చేసుకుంది. ఆపై ఈరోజుకు విచారణను వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు ఈరోజు (గురువారం) మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను ఈనెల 23కు నాంపల్లి కోర్టు వాయిదా వేసింది.
కాగా.. వాంగ్మూలంలో మంత్రిపై నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘సినిమా రంగం ద్వారా మా కుటుంబానికి మంచి పేరు ప్రతిష్ఠలు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా మా కుటుంబం పట్ల ఆధారాభిమానాలు ఉన్నాయి. జాతీయ స్థాయిలో అనేక అవార్డులు వచ్చాయి. సినిమా రంగంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. మా కుమారుడు విడాకులకు మాజీ మంత్రి కేటీఆర్ కారణం అని మంత్రి అసభ్యంగా మాట్లాడారు. అలా మాట్లాడం వల్ల మా పరువు ప్రతిష్ఠలకు భంగం వాటిల్లింది. మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. మంత్రి కొండా సురేఖ మాట్లాడిన మాటలు అన్ని అసత్య ఆరోపణలు. రాజకీయ దురుద్దేశంతో మంత్రి ఇలాంటి వాఖ్యలు చేశారు. ఎంతో పేరు ప్రతిష్ఠలు ఉన్న తన కుటుంబం తీవ్ర మనో వేదనకు గురైంది. మంత్రి మాట్లాడిన మాటలు అన్ని టెలివిజన్ ఛానెల్స్‌లో ప్రసారం చేశాయి. అన్ని పేపర్స్ ప్రచురితం చేశాయి. దీని వల్ల మా కుటుంబం తీవ్ర మనోవేదనకు గురైంది. దేశ వ్యాప్తంగా మా కుటుంబంపై తీవ్ర ప్రభావం పడింది. ఇలా మంత్రి చేసిన వ్యాఖ్యల వల్ల మా కుటుంబానికి నష్టం జరిగింది. మా కుటుంబం మానసిక క్షోభకు గురైంది’’ అంటూ కోర్టుకు నాగార్జున స్టేట్మెంట్ ఇచ్చారు.
YS Jagan: హర్యానాపై సరే.. కశ్మీర్ సంగతేంది.. జగన్ తెలివితక్కువ తనాన్ని బయటపెట్టుకున్నారా..
మా కుటుంబ షాక్‌కు గురైంది: సుప్రియ
నాగార్జున స్టేట్మెంట్ పూర్తి అయిన తరువాత సాక్షిగా సుప్రియ స్టేట్మెంట్ను కోర్టు నమోదు చేసుకుంది. ‘‘కేటీఆర్ వల్ల నాగ చైతన్య, సమంత విడాకులు జరిగాయని అని మంత్రి మాట్లాడారు.. ఎన్ కన్వెన్షన్ విషయంలో సమంతను కేటీఆర్ దగ్గరికి పంపించమంటే సమంత ఒప్పుకోలేదు. అందుకే విడాకులు తీసుకుందని మంత్రి మాట్లాడారు. దీంతో మా కుటుంబం మొత్తం షాక్‌నకు గురైంది. ఈ విధంగా మంత్రి మా కుటుంబంపై ఎందుకు మాట్లాడిందో అర్థం కాలేదు. దాంతో మా కుటుంబం తీవ్ర మనోవేదనకు గురైంది. మంత్రి చేసిన వ్యాఖ్యలు నేను కొన్ని మీడియా చానెళ్లలో చూశా. నేషనల్ మీడియాలో కూడా ఈ వార్త విన్నాను. మరుసటి రోజు పేపర్లో కూడా వార్త వచ్చింది. దీని వల్ల మా కుటుంబం తీవ్రమైనోవేదనకు గురైంది’’ అంటూ సుప్రియ వాంగ్మూలం ఇచ్చారు.
నాంపల్లి కోర్టుకు కేటీఆర్...
మరోవైపు తనపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ కూడా కోర్టును ఆశ్రయించారు. కొండా సురేఖపై నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్‌లో మాజీ మంత్రి పిటిషన్ వేశారు. తనపై చేసిన వ్యాఖ్యలు తన ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్లో పేర్కొన్నారు. కేటీఆర్ వేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమ, దాసోజు శ్రవణ్‌ను సాక్షులుగా కేటీఆర్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
YS Jagan: హర్యానాపై సరే.. కశ్మీర్ సంగతేంది.. జగన్ తెలివితక్కువ తనాన్ని బయటపెట్టుకున్నారా..
Ratan Tata: టాటా గ్రూపు ఓనరైన రతన్ టాటా ఆస్తులు ఎంత.. కంపెనీ ప్రాపర్టీ ఎంత..
Read Latest Telangana News And Telugu News
Updated Date - Oct 10 , 2024 | 02:46 PM