ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TS NEWS: మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ కేసులో నాంపల్లి కోర్టు కీలక తీర్పు

ABN, Publish Date - Feb 16 , 2024 | 10:50 PM

మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ పిటీషన్‌పై నాంపల్లి కోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ విచారణలో కీలక తీర్పు ఇచ్చింది. శ్రీనివాస్‌ గౌడ్‌పై దాఖలైన పిటీషన్‌ను నాంపల్లి కోర్టు కొట్టేసింది.

హైదరాబాద్: మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ పిటీషన్‌పై నాంపల్లి కోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ విచారణలో కీలక తీర్పు ఇచ్చింది. శ్రీనివాస్‌ గౌడ్‌పై దాఖలైన పిటీషన్‌ను నాంపల్లి కోర్టు కొట్టేసింది. పిటీషన్‌ను రాఘవేందర్ రాజు దాఖలు చేశారు. 2018 ఎన్నికల ఆఫిడవిట్‌లో మార్పులు చేశారంటూ రాఘవేందర్‌ రాజు కోర్టులో పిటీషన్‌ వేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని రాఘవేందర్ రాజు తెలిపారు.

కేసు నమోదు చేసేలా పోలీసులకు ఆదేశాలివ్వాలని రాఘవేందర్ రాజు కోరారు. ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశాల మేరకు మహబూబ్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆఫిడవిట్‌లో మార్పులకు సంబంధించి తగిన ఆధారాలు లేవని కోర్టుకు పోలీసులు తెలిపారు. పోలీసుల నివేదికపై పిటీషనర్ రాఘవేందర్ రాజు అభ్యంతరం తెలిపారు. పిటీషన్‌ విచారించే పరిధి ప్రజాప్రతినిధుల కోర్టుకు లేదని న్యాయమూర్తి చెప్పారు. ఏ కోర్టు పరిధిలోకి వస్తుందో తేల్చుకోవడానికి హైకోర్టును ఆశ్రయించాలని పిటీషనర్‌కు న్యాయమూర్తి సూచించారు.

Updated Date - Feb 16 , 2024 | 10:50 PM

Advertising
Advertising