NCW: మియాపూర్ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్
ABN, Publish Date - Jul 04 , 2024 | 01:39 PM
Telangana: భాగ్యనగరంలో తీవ్ర కలకలం రేపిన మియాపూర్ అత్యాచారయత్నం ఘటనను జాతీయ మహిళా కమిషన్ సీరియస్‌గా తీసుకుంది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన కమిషన్.. పారదర్శకంగా విచారణ జరిపి మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని రాష్ట్ర డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు డీజీపీకి జాతీయ మహిళా కమిషన్ లేఖ రాసింది.
హైదరాబాద్, జూలై 4: భాగ్యనగరంలో (Hyderabad) తీవ్ర కలకలం రేపిన మియాపూర్ అత్యాచారయత్నం ఘటనను జాతీయ మహిళా కమిషన్ (National Commission for Women) సీరియస్‌గా తీసుకుంది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన కమిషన్.. పారదర్శకంగా విచారణ జరిపి మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని రాష్ట్ర డీజీపీ రవిగుప్తాకు (DGP Ravi gupta) ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు డీజీపీకి జాతీయ మహిళా కమిషన్ లేఖ రాసింది. అలాగే బాధితురాలికి మెరుగైన వైద్యపరీక్షలు ఉచితంగా అందించాలని లేఖలో పేర్కొంది. నిందితులకు శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ తెలిపింది.
YS Jagan: పిన్నెల్లిని జైలులో కలిసొచ్చాక వైఎస్ జగన్ ఇలా మాట్లాడారేంటి..?
అసలేం జరిగిందంటే..
మియాపూర్‌లో ఓ యువతిపై రియల్ ఎస్టేట్ సేల్స్ కంపెనీకి చెందిన ఇద్దరు ఎగ్జిక్యూటివ్‌లు అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. యువతిని కారులో తిప్పుతూ చిత్రహింసలకు గురిచేశారు. ఉద్యోగం కోసం కడప నుంచి హైదరాబాద్‌కు వచ్చిన సదరు యువతి ఉప్పల్‌లో నివాసం ఉంటూ.. మియాపూర్‌లోని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో సేల్స్ ట్రైనీగా పనిచేస్తోంది. అదే కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లుగా పనిచేస్తున్న సంగారెడ్డి, జనార్దన్‌లు యువతికి సైట్ చూపిస్తామంటూ కారులో తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించారు. అయితే వారి నుంచి తప్పించుకున్న ఆమె నేరుగా ఉప్పల్ పోలీసులను ఆశ్రయించింది. వెంటనే జీరో ఎఫ్‌ఐఆర్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు.... అక్కడి నుంచి మియాపూర్‌కు కేసును బదిలీ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే యువతిని ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు జరిపించారు.
ఇవి కూడా చదవండి...
AP High Court: వైసీపీ ఆఫీసుల విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు..
CM Chandrababu: ప్రధాని మోదీతో ముగిసిన చంద్రబాబు భేటీ.. ఏమేం చర్చించారు..!?
Read Latest Telangana News AND Telugu News
Updated Date - Jul 04 , 2024 | 04:47 PM