ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Niranjan Reddy: 6 గ్యారెంటీల అమల్లో కాంగ్రెస్ విఫలం

ABN, Publish Date - Feb 18 , 2024 | 10:44 PM

6 గ్యారెంటీల అమల్లో కాంగ్రెస్ విఫలం అయిందని మాజీమంత్రి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) ఆరోపించారు. కాంగ్రెస్‌ను గిల్లితే తెలంగాణలో బీజేపీ నేతలకు ఎందుకు నొప్పి పుడుతోందని ప్రశ్నించారు.

హైదరాబాద్: 6 గ్యారెంటీల అమల్లో కాంగ్రెస్ విఫలం అయిందని మాజీమంత్రి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) ఆరోపించారు. కాంగ్రెస్‌ను గిల్లితే తెలంగాణలో బీజేపీ నేతలకు ఎందుకు నొప్పి పుడుతోందని ప్రశ్నించారు. బీఆర్ఎస్, మాజీ సీఎం కేసీఆర్ మీద బీజేపీ బురదజల్లిందని.. కాంగ్రెస్‌ను హామీల విషయంలో ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. ఉచిత బస్సు తప్ప 72 రోజుల్లో కొత్తగా రాష్ట్రంలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని ప్రశ్నించారు. ఆదివారం నాడు తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... అసెంబ్లీ సమావేశాల్లో సమస్యలు, హామీలకు పరిష్కారం లేదని.. ప్రత్యామ్నాయం లేదని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది ? అన్నదే.. కానీ అంతకన్నా తాము ఏం మెరుగ్గా చేస్తామన్నది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పకపోవడం విచారకరమని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు సంబంధించి బడ్జెట్‌లో సరిపడా కేటాయింపులు జరగలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీల అమలు సాధ్యం కాదని బడ్జెట్ ద్వారా తేల్చిచెప్పిందని అన్నారు.

మేడిగడ్డలో మూడు పిల్లర్ల కుంగుబాటును భూతద్దంలో చూపి గత ప్రభుత్వ తొమ్మిదిన్నరేళ్ల పాలనను బద్నాం చేసే ప్రయత్నం జరుగుతున్నదని విురుచుకుపడ్డారు. మాజీమంత్రి హరీష్ రావు ప్రశ్నలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , కాంగ్రెస్ మంత్రులు సమాధానాలు చెప్పలేక నొరేళ్లబెట్టారని ఎద్దేవా చేశారు.అందుకే అడుగడుగునా అడ్డంకులు సృష్టించారని ధ్వజమెత్తారు. సాంప్రదాయాలకు భిన్నంగా ఇరిగేషన్ చర్చకు ఇతర శాఖల మంత్రులు స్పందించడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలను ప్రకటించి తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని.. ఈ హామీల అమల్లో విఫలమైందని మండిపడ్డారు. తొమ్మిదేళ్ల తర్వాత రాష్ట్రంలో తిరిగి కరెంటు కోతలు మొదలయ్యాయని చెప్పారు.

కాళేశ్వరంపై విచారణ చేయించాలి

మూడెకరాలకు మించి రైతుబంధు ఇంత వరకూ ఇవ్వలేదని అన్నారు. రైతుభరోసా అమలు చేస్తారా ? చేయరా ? ఇచ్చిన మాట ప్రకారం ఎకరాకు రూ.15 వేలు ఇవ్వడం మీద ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని తెలిపారు. కాళేశ్వరాన్ని అడ్డు పెట్టుకుని తప్పించుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ఉన్నదన్నారు. కాళేశ్వరంపై అత్యన్నత స్థాయిలో విచారణ జరిపించాలని... ప్రభుత్వం వీరి చేతిలోనే ఉన్నదని.. ఏ చర్యకైనా, విచారణకైనా బీఆర్ఎస్ సిద్ధమని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ మీద కక్ష్యతో రైతులకు వచ్చే నీళ్ల విషయంలో అన్యాయం చేయొద్దని చెప్పారు. కాళేశ్వరం కింద ఉన్న రిజర్వాయర్లు, టన్నెళ్లను వాడుకునేందుకు అవకాశం ఉన్నదన్నారు. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ల సరఫరా విషయంలో స్పష్టత లేదన్నారు. పేర్లు మారుస్తారా ? ఏం చేస్తారో చేసుకోవాలని అన్నారు. ప్రజలకు పథకాలు అందేలా చూడాలని తెలిపారు.

ఆలేరు మెడికల్ కళాశాలను కొడంగల్‌కు తరలించడం పద్ధతికాదన్నారు. చేతనైతే కొత్త మెడికల్ కళాశాల కొడంగల్‌లో పెట్టాలని కోరారు. వెనకబడ్డ కొడంగల్ అభివృద్ధి చేస్తే తాము అడ్డుకోమని అన్నారు. గత ప్రభుత్వాన్ని బద్నాం చేయాలన్న కుట్రతో ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదని చెప్పారు. తెలంగాణ ప్రతి ఇంచు మీద కేసీఆర్‌కు అవగాహన ఉన్నదని.. అందుకే గత పదేళ్లలో తెలంగాణను అభివృద్ధి చేశారని తెలిపారు. 6 గ్యారంటీల అమలు మీద ప్రజలకు ప్రభుత్వం జవాబు చెప్పాలని ప్రశ్నించారు. రైతుబంధు, రైతు భీమా, నీళ్లు, కరెంటు, వరి ధాన్యం, పంటల కొనుగోళ్లు, వరి ధాన్యం క్వింటాలుకు రూ.500 బోనస్‌పై ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్నారు. వరి ధాన్యానికి రూ.500 బోనస్ విషయంలో మాటతప్పితే విడిచిపెట్టేది లేదని హెచ్చరించారు.

Updated Date - Feb 18 , 2024 | 10:44 PM

Advertising
Advertising