ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hydra: గ్రేటర్‌లో కొనసాగుతున్న ఆపరేషన్ ‘హైడ్రా’

ABN, Publish Date - Aug 13 , 2024 | 04:54 PM

Telangana: గ్రేటర్‌లో ఆపరేషన్ హైడ్రా కొనసాగుతోంది. మంగళవారం నాడు జీహెచ్ఎంసీలో చెరువులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఉప్పల్ నల్లచెరువులో కబ్జాలకు పాల్పడితే సహించేది లేదని హైడ్రా కమిషనర్ హెచ్చరించారు.

Hydra Commissioner Ranganath

హైదరాబాద్, ఆగస్టు 13: గ్రేటర్‌లో ఆపరేషన్ హైడ్రా కొనసాగుతోంది. మంగళవారం నాడు జీహెచ్ఎంసీలో చెరువులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Hydra Commissioner Ranganath) పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఉప్పల్ నల్లచెరువులో కబ్జాలకు పాల్పడితే సహించేది లేదని హైడ్రా కమిషనర్ హెచ్చరించారు. చెరువు పర్యవేక్షణకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించనున్నట్లు తెలిపారు.

BRS Leader Srinivas Goud: తెలంగాణ డెయిరీలను ఖతం చేసే కుట్ర జరుగుతోంది..


ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి సోమవారం కమిషనర్ రంగనాథ్‌ను కలసి ఉప్పల్ నల్ల చెరువులో జరుగుతున్న కబ్జాల గురించి వివరించిన విషయం తెలిసిందే. దీంతో రంగనాథ్ మంగళవారం ఉప్పల్లోని ఎమ్మెల్సీ తీన్ మార్ మల్లన్న, పరమేశ్వర్ రెడ్డి వజ్రేష్ యాదవ్, ఉప్పల్ కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డితో కలిసి నల్లచెరువును పరిశీలించారు. నల్ల చెరువులో కబ్జాలను, ఆక్రమణలు పూర్తిగా తొలగించడంతో పాటు చెరువు పరిరక్షణ కోసం హైడ్రా పనిచేస్తుందని తెలిపారు. చెరువులను, నాలాలను, ఇతర ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి కబ్జాలకు పాల్పడితే చర్యలు కఠినంగా ఉంటాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు.


దానం ఫైర్

మరోవైపు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నందగిరి హిల్స్‌ హుడా లేఔట్‌ ఘటన నేఫథ్యంలో మంగళవారం నాడు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ... రంగనాథ్‌కు కొత్తగా వచ్చిన పదవి ఇష్టం లేనట్టుందన్నారు. అందుకే తనపై కేసు పెట్టారని దానం తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించారు. అధికారులు వస్తుంటారు పోతుంటారు.. కానీ తాను మాత్రం లోకల్ అని పేర్కొన్నారు. నందగిరి హిల్స్ హుడా లేఔట్ విషయంలో అధికారులు అతిగా ప్రవర్తిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ వ్యవహారంలో అధికారులకు ప్రివిలేజ్ నోటీసులు ఇస్తానని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చారు.

Amaravati: అమ్మ జోగీ.. ఇలా దోచేశారా..!?


అంతేకాదు.. సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. హైడ్రా అధికారులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నందగిరి హిల్స్ గురుబ్రహ్మ నగర్‌లో పేదల గుడిసెలు కూల్చివేసే అధికారం వారికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. పార్క్ స్థలం అని చెప్పి ఈవీడీఎం వాళ్లు పెద్ద ప్రహరీ గోడ కడుతున్నారని.. బస్తీ వాసులకు దారి లేకుండా ప్రహరీ గోడ ఎలా కడతారు? అని ప్రశ్నించారు. గోడ కట్టొద్దన్నందుకే ఈవీడీఎం అధికారులు తనపై కేసు పెట్టారని దానం తెలిపారు. హైదరాబాద్‌ను హైడ్రా అధికారులకేమీ రాసివ్వలేదని.. ప్రజా సమస్యలపై తన పోరాటం కొనసాగుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. తనపై 190 కేసులు ఉన్నాయని.. కేసులకు భయపడే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

New Delhi: ముగిసిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం

Sunitarao: నాకు అవకాశం ఇవ్వండి.. కాంగ్రెస్ మహిళ నేత విజ్ఞప్తి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 13 , 2024 | 04:54 PM

Advertising
Advertising
<