ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ బ్యాకప్‌! దొరికిందో కథ వేరే లెవెల్..!

ABN, Publish Date - Apr 14 , 2024 | 02:49 AM

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో శనివారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రణీత్‌రావు ఎస్‌ఐబీలోని తన విభాగంలో ఉన్న....

Phone Tapping Case

  • స్టోరేజ్‌ డివైజ్‌లలో భద్రపరిచిన ప్రణీత్‌రావు!..

  • అవి దొరికితే.. బలమైన ఆధారాలున్నట్లే

  • సీజ్‌ చేసే పనిలో దర్యాప్తు అధికారులు బిజీ..

  • ఈ కేసులో.. ఇప్పటికి 40 మంది విచారణ

  • ప్రణీత్‌రావు ఇంత చేసినా రిలీవింగ్‌ సమయంలో ఎస్‌ఐబీ నుంచి ‘నో డ్యూస్‌’

  • ఎన్నికల్లో పోటీ చేయలే..

  • డబ్బెలా తరలిస్తా: మెదక్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వెంకట్రామారెడ్డి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): ఫోన్‌ ట్యాపింగ్‌(Phone Tapping) కేసులో శనివారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రణీత్‌రావు(Pranith Rao) ఎస్‌ఐబీలోని(SIB) తన విభాగంలో ఉన్న 17 కంప్యూటర్ల హార్డ్‌డి్‌స్కలను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే..! ఆ హార్డ్‌డిస్క్‌ శకలాలు లభించినా.. వాటి నుంచి డేటా రికవరీ సాధ్యం కాదు. సీరియస్‌ కేసు కావడం.. దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన అంశం కావడంతో.. నిందితులకు శిక్ష పడేలా ఆధారాల కోసం అన్వేషిస్తున్న దర్యాప్తు అధికారులు.. ఆ డేటా బ్యాకప్‌ ఉన్నట్లు గుర్తించినట్లు తెలిసింది. ప్రణీత్‌రావు హార్డ్‌డి్‌స్కలను ధ్వంసం చేయడానికి ముందు.. పెన్‌డ్రైవ్‌లు, ఫ్లాష్‌డ్రైవ్‌లు, ఎక్స్‌టర్నల్‌ హార్డ్‌డి్‌స్కలలో బ్యాకప్‌ తీసుకున్నట్లు సమాచారం. ఆ బ్యాకప్‌ లభిస్తే.. కోర్టుల్లో కేసు ఎక్కడా వీగిపోకుండా, నిందితులకు శిక్షపడేలా చేయవచ్చని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. నిజానికి చట్టబద్ధంగా ఫోన్‌ట్యాపింగ్‌ చేస్తే.. టార్గెట్‌ వ్యక్తులు ఏమేం మాట్లాడుకుంటున్నారనేది నేరుగా వినొచ్చు. అలా వింటూనే రికార్డ్‌ చేయవచ్చు. కానీ, ప్రభాకర్‌రావు అండ్‌ కో చేసింది అనధికారిక ఫోన్‌ట్యాపింగ్‌ కావడంతో.. ఈ ప్రక్రియలో కొంత తేడా ఉంటుంది. ప్రత్యేక డివైజ్‌ల ద్వారా చేసే ఫోన్‌ ట్యాపింగ్‌లో తొలుత టార్గెట్‌ వ్యక్తుల సంభాషణలన్నీ ఎన్‌క్రిప్టెడ్‌ ఫైల్స్‌ రూపంలో సేవ్‌ అవుతాయి. ఆ ఫైల్స్‌ను డీక్రిప్ట్‌ చేసి, ఆడియో ఫార్మాట్‌లో సేవ్‌ చేస్తే తప్ప.. ఇతరులు వినడానికి వీలు ఉండదు. అలా ప్రణీత్‌రావు డీక్రిప్ట్‌ చేసిన ఫైళ్లను విని, పెన్‌డ్రైవ్‌లలో గత ప్రభుత్వ పెద్దల వద్దకు తీసుకెళ్లేవాడని తెలుస్తోంది. ఇప్పుడు ఆ పెన్‌/ఫ్లా్‌ష డ్రైవ్‌లు, ఎక్స్‌టర్నల్‌ హార్డ్‌డి్‌స్కలను గుర్తించి, సీజ్‌ చేసే పనిలో దర్యాప్తు అధికారులు ఉన్నారు. ఈ కేసులో పోలీసు శాఖకు చెందిన నిందితుల అరెస్టులు, సాక్షుల విచారణ పూర్తయినట్లు తెలుస్తోంది. టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ(ఓఎస్డీ) రాధాకిషన్‌రావు, మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు అండ్‌ కో పరిధిలో పనిచేసే హోంగార్డు మొదలు.. ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారి వరకు ఉన్నారు.

40 మంది సాక్షులే..!

ఈ కోవలో ఉన్న సుమారు 40 మందికి తాము ఏం చేస్తున్నాం? ఎవరికోసం చేస్తున్నాం? అనేదానిపై పూర్తిస్థాయి అవగాహన లేదని దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ 40 మందిని సాక్షులుగా విచారించినట్లు తెలిసింది. వారి వాంగ్మూలాలను రికార్డు చేసుకుని, పంపినట్లు సమాచారం. దర్యాప్తులో భాగంగా అవసరమైతే వీరిని మరోమారు విచారించే అవకాశాలున్నాయి. ఇక ఈ కేసులో కీలక పాత్రధారిగా గుర్తించిన ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు విషయంలో తదుపరి చర్యలపై దర్యాప్తు అధికారులు న్యాయ నిపుణుల సలహాలను తీసుకుంటున్నారు. కాగా, పోలీసు శాఖలో అధికారుల బదిలీలు జరిగితే.. వారు పాతస్థానంలో రిలీవడ్‌ అవ్వడంతోపాటు.. ‘నో డ్యూస్‌’ సర్టిఫికెట్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రణీత్‌రావు ఎస్‌ఐబీలోని తన సెక్షన్‌లో ఉన్న 17 కంప్యూటర్ల హార్డ్‌డి్‌స్కలను ధ్వంసం చేశాక.. వాటి స్థానంలో కొత్తవాటిని బిగించి, ఏమీ తెలియనట్లే నటించాడని సమాచారం. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక.. పోలీసు శాఖను క్రమంగా ప్రక్షాళన చేస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే డిసెంబరు 31న జరిగిన డీఎస్పీల బదిలీల్లో ప్రణీత్‌రావుకు స్థానచలనం కలిగింది. హార్డ్‌డి్‌స్కలు, ఇతర ఎలకా్ట్రనిక్‌ పరికరాల లెక్క సరిగ్గా ఉండడంతో.. ఉన్నతాధికారులు ఆయనకు ‘నో డ్యూస్‌’ సర్టిఫికెట్‌ ఇవ్వడం గమనార్హం..!

నన్ను ఓడించేందుకు కుట్ర: వెంకట్రామారెడ్డి

సిద్దిపేట, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): తనను రాజకీయంగా ఎదుర్కునే సత్తా లేక.. మీడియాకు లీకులిచ్చి తప్పుడు వార్తలు రాయిస్తున్నారని మెదక్‌ లోకసభ సెగ్మెంట్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వెంకట్రామారెడ్డి విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్‌పార్టీలు చేతులు కలిపి.. తనను ఓడించేందుకు కుట్ర పన్నుతున్నాయని శనివారం శనివారం ఓ ప్రకటనలో ఆరోపించారు. గత ఎన్నికల్లో పోటీ చేయని తాను.. డబ్బులు తరలించినట్లుగా కథలు అల్లుతున్నారని మండిపడ్డారు. అప్పట్లో తాను ఎమ్మెల్సీగా, పరోక్షరాజకీయాల్లో ఉన్నట్లు గుర్తుచేశారు. బట్టకాల్చి మీద వేసినట్లుగా ఆ రెండు పార్టీలు తనపై కుట్రలు చేస్తున్నాయన్నారు. సిద్ధాంతాలు, విలువలను గాలికి వదిలేసి, ప్రజలను మభ్యపెట్టేలా రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగిగా, కలెక్టర్‌గా ప్రజలకు నిజాయితీగా సేవలందించిన అనుభవంతోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ప్రజ ల్లో తనకు వస్తున్న స్పందనను చూసి ఓర్వలేకనే బీజేపీ, కాంగ్రె్‌సలు కుట్ర చేస్తున్నాయని, తన మనోధైర్యాన్ని దెబ్బతీసేయత్నం చేస్తున్నాయని ఆరోపించారు.

Updated Date - Apr 14 , 2024 | 06:57 AM

Advertising
Advertising