PM Modi: రేపు సాయంత్రం మల్కాజ్‌గిరిలో ప్రధాని మోదీ రోడ్ షో
ABN, Publish Date - Mar 14 , 2024 | 08:59 AM
హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచింది. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం హైదరాబాద్‌కు రానున్నారు. పది రోజుల వ్యవధిలో మోదీ రెండోసారి రాష్ట్రానికి వస్తున్నారు. మూడు రోజుల పాటు లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొంటారు.
హైదరాబాద్: పార్లమెంట్ (Parliament) ఎన్నికల ప్రచారం (Election Campaign)లో బీజేపీ (BJP) దూకుడు పెంచింది. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) శుక్రవారం హైదరాబాద్ (Hyderabad)కు రానున్నారు. పది రోజుల వ్యవధిలో మోదీ రెండోసారి రాష్ట్రానికి వస్తున్నారు. మూడు రోజుల పాటు లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొంటారు. శుక్రవారం సాయంత్రం మల్కాజ్‌గిరిలో ప్రధాని మోదీ రోడ్ షో (Road Show) నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు (BJP Leaders) రోడ్ షోకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మీర్జాలగూడ నుంచి మల్కాజ్‌గిరి వరకు మోదీ రోడ్ షో జరగనుంది. మల్కాజ్‌గిరి లోక్‌సభ పరిధిలో 1.3 కి.మీ. మేర ప్రధాని రోడ్ షో జరుగుతుంది. అలాగే 16న (శనివారం) నాగర్‌కర్నూల్‌లో మోదీ బహిరంగ సభ నిర్వహిస్తారు. 18న జగిత్యాలలో జరగనున్న బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు.
16న నాగర్‌కర్నూల్‌కు మోదీ భారీ బహిరంగ సభకు బీజేపీ ఏర్పాట్లు
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నాగర్‌కర్నూల్ పర్యటన ఖరారయింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని శనివారం(16న) నాగర్‌కర్నూల్‌కు వస్తున్నారు. దాంతో వెలమ సంఘం కల్యాణ మండపం పక్కన భారీ బహిరంగ సభ నిర్వహణకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్‌రావు ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ప్రముఖ బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో బుధవారం సన్నాహక సమావేశం జరిగింది. మోదీ తొలిసారి నాగర్‌కర్నూల్‌కు వస్తున్నందున భారీ ఎత్తున జనసమీకరణ చేయాలని బీజేపీ నాయకులు నిర్ణయించారు. అందుకోసం సభకు ఉమ్మడి జిల్లా, బీజేపీ పట్టు ఉన్న ప్రాంతాల నుంచే కాకుండా మిగతా నియోజకవర్గాల నుంచి కూడా జనాన్ని తరలింగే ప్రయత్నాలు చేస్తున్నారు.
Updated Date - Mar 14 , 2024 | 08:59 AM