ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: అల్లు అర్జున్‌కు వైద్య పరీక్షలు పూర్తి.. మరికాసేపట్లో నాంపల్లి కోర్టుకు బన్నీ..

ABN, Publish Date - Dec 13 , 2024 | 03:04 PM

సంధ్యా థియేటర్ ఘటనలో అరెస్టయిన సినీ నటుడు అల్లు అర్జున్‌కు పోలీసులు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షలు పూర్తయిన తర్వాత గాంధీ ఆస్పత్రి నుంచి మరికొద్ది సేపట్లో నాంపల్లి కోర్టుకు ఆయన్ను పోలీసులు తరలించనున్నారు.

హైదరాబాద్: సంధ్యా థియేటర్ ఘటనలో అరెస్టయిన సినీ నటుడు అల్లు అర్జున్‌కు పోలీసులు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షలు పూర్తయిన తర్వాత గాంధీ ఆస్పత్రి నుంచి మరికొద్ది సేపట్లో నాంపల్లి కోర్టుకు ఆయన్ను పోలీసులు తరలించనున్నారు. నాలుగు పోలీస్ వాహనాలతో భారీ భద్రత నడుమ నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్‌ను తీసుకువచ్చేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరికాసేపట్లో నాంపల్లి కోర్టు ఎదుట హాజరుపరచునున్నారు. మరోవైపు తనపై నమోదైన కేసు కొట్టివేయాలంటూ హైకోర్టును అల్లు అర్జున్ ఆశ్రయించారు. అల్లు అర్జున్ వేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టు శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు విచారణ చేపట్టనుంది. అరెస్టు తదనంతర పరిణామాలపై విచారణ జరగనుంది. హైకోర్టు నిర్ణయం తర్వాతే నాంపల్లి కోర్టు ముందుకు అల్లు అర్జున్‌ను పోలీసులు తీసుకువెళ్లే అవకాశం కనిపిస్తోంది.


బన్నీ ఇంటికి ప్రముఖులు..

కాగా, అల్లు అర్జున్ అరెస్టు నేపథ్యంలో ఆయన నివాసం వద్దకు పెద్దఎత్తున సినీ ప్రముఖులు తరలివస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు బన్నీ ఇంటికి చేరుకున్నారు. అలాగే నటుడు నాగబాబు సైతం అల్లు ఇంటికి చేరుకున్నారు. వారంతా అల్లు ఫ్యామిలీని పరామర్శించి ధైర్యం చెప్పారు.


అరెస్టు.. ఖండించిన ప్రముఖులు..

మరోవైపు అల్లు అర్జున్ అరెస్టును ఎక్స్ వేదికగా బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఖండించారు. విషాదకర తొక్కిసలాట ఘటనకు పోలీసు శాఖ వైఫల్యమే కారణమని ఆయన అన్నారు. తన నటన, విజయాలతో తెలుగు రాష్ట్రాలకు ఎనలేని గౌరవం తెచ్చిపెట్టిన జాతీయ అవార్డు గ్రహీత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అని రాజా సింగ్ అన్నారు. తొక్కిసలాట ఘటన విషయంలో నేరుగా బన్నీని బాధ్యుడిని చేయడం, దానికి అతన్ని జవాబుదారీగా చేయడం అన్యాయం, అసమంజసం అని రాజా సింగ్ అన్నారు. ఆ రోజు క్రౌడ్ మేనేజ్‌మెంట్‌ చేయకుండా నేడు అల్లు అర్జున్‌ని బాధ్యుడిని చేయడాన్ని ఖండించారు. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఆత్మ పరిశీలన చేసుకోవాలని రాజా సింగ్ అన్నారు.

Updated Date - Dec 13 , 2024 | 03:15 PM