TS News: సెక్రటేరియట్ ముట్టడి... రాజారాం యాదవ్ అరెస్ట్‌కు రంగం సిద్ధం..
ABN, Publish Date - Jul 15 , 2024 | 11:33 AM
Telangana: బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ ఆధ్వర్యంలో సెక్రటేరియట్ ముట్టడి నేపథ్యంలో నగరంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ముట్టడిని అడ్డుకునేందుకు పోలీసులు శతవిధాలుగా యత్నిస్తున్నారు. అలాగే రాజారాం యాదవ్‌ను ముందస్తుగా అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేపట్టారు.
హైదరాబాద్, జూలై 15: బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ ( BC Janasabha state president Rajaram Yadav) ఆధ్వర్యంలో సెక్రటేరియట్ ముట్టడి నేపథ్యంలో నగరంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ముట్టడిని అడ్డుకునేందుకు పోలీసులు (Telangana Police) శతవిధాలుగా యత్నిస్తున్నారు. అలాగే రాజారాం యాదవ్‌ను ముందస్తుగా అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేపట్టారు. సెక్రటేరియట్ పరిసరాల్లో భారీగా పోలీస్ బలగాలు మోహరించారు. జిల్లాల నుంచి తరలి వస్తున్న సంఘాల నాయకులను ఎక్కడిక్కడ అరెస్ట్‌లు చేస్తున్నారు. మరోవైపు సెక్రటేరియట్ ముట్టడికి విద్యార్థులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈ క్రమంలో అశోక్‌నగర్ క్రాస్ రోడ్డులో పోలీసులు నిఘా పెంచారు.
Minister Dola: విద్యార్థులకు అస్వస్థత... హుటాహుటిన నాయుడుపేటకు మంత్రి డోలా
కాగా... ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఏటా రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్ విడుదల, మెగా డీఎస్సీ నోటిఫికేషన్, గ్రూప్ 2, 3 పోస్టుల పెంపు, డీఎస్సీ పరీక్షల వాయిదా, గ్రూప్-1 మెయిన్‌కు 1:100 పద్ధతిలో అభ్యర్థులను పిలవాలనే డిమాండ్లతో సెక్రటేరియట్ ముట్టడికి బీసీ అధ్యక్షులు రాజారాం, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి...
TS News: మేడ్చల్‌లో హోంగార్డ్ హల్‌చల్
Yadagirigutta: గిరిప్రదర్శన వన మహోత్సవం ప్రారంభం..
Read Latest Telangana News And Telugu News
Updated Date - Jul 15 , 2024 | 11:43 AM