ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ts News: హాజరుకాకుంటే అరెస్ట్ తప్పదని హెచ్చరికలు

ABN, Publish Date - Oct 28 , 2024 | 11:55 AM

మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు మోకిలా పోలీసులు నోటీసులు ఇచ్చారు. సోమవారం తమ ముందు హాజరు కావాలన్నారు. అడ్రస్ ప్రూప్‌లతోపాటు, కేసుకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని కోరారు. విచారణకు హాజరు కాకుంటే తదుపరి చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొన్నారు.

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS Working President), మాజీ మంత్రి కేటీఆర్ (Ex Minister KTR) బావమరిది రాజ్ పాకాలకు (Raj Pakala) మోకిలా పోలీసులు (Police) నోటీసులు (Notices) ఇచ్చారు. బిఎన్‌ఎస్‌ఎస్ 35(3) సెక్షన్ ప్రకారం నోటీసులు జారీ చేశారు. రేవ్ పార్టీ కేసుకు సంబంధించి విచారించాల్సి ఉందని పోలీసులు ఆ నోటీసులో పేర్కొన్నారు. సోమవారం తమ ముందు హాజరు కావాలన్నారు. అడ్రస్ ప్రూప్‌లతోపాటు, కేసుకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని కోరారు. విచారణకు హాజరు కాకుంటే తదుపరి చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొన్నారు. ఈరోజు మోకిలా పీఎస్‌కు హాజరు కాకుంటే బిఎన్‌ఎస్‌ఎస్ 35 (3),(4),(5),(6) సెక్షన్ల ప్రకారం అరెస్టుకు దారి తీస్తుందని పేర్కొంటూ రాజ్ పాకాలకు మోకిలా ఇన్స్‌పెక్టర్ నోటీసులు జారీచేశారు.


కాగా రాజ్‌ పాకాల ఇచ్చిన పార్టీలో డ్రగ్స్‌ వాడినట్లు తేలడం కలకలం సృష్టించింది. రాజ్‌ పాకాల సన్నిహితుడు, వ్యాపార భాగస్వామి అయిన విజయ్‌ మద్దూరి కొకైన్‌ తీసుకున్నారు.. తొలుత బుకాయించిన విజయ్‌.. మూత్ర పరీక్షలో కొకైన్‌ తీసుకున్నట్లు తేలడంతో రాజ్‌ (రాజేంద్ర ప్రసాద్‌) పాకాల ఇస్తేనే తాను డ్రగ్‌ తీసుకున్నట్లు చెప్పడం గమనార్హం.. విజయ్‌ వాంగ్మూలం ఈ కేసులో కీలకంగా మారనుంది. పార్టీలో కొకైన్‌ ఎలా వచ్చిందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన జన్వాడ ‘ఫాంహౌస్‌ పార్టీ’కి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. తమ ప్రాంతంలో పెద్దపెద్ద శబ్దాలతో కొందరు పార్టీ చేసుకుంటూ ఇబ్బంది కలిగిస్తున్నారంటూ రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం జన్వాడకు చెందిన వ్యక్తులు కొందరు శనివారం రాత్రి 100కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేశారు.

దీంతో మోకిల, శంకర్‌పల్లి, నార్సింగి, ఎస్‌వోటీ పోలీసులు నార్సింగి ఏసీపీ రమణగౌడ్‌ ఆధ్వర్యంలో జన్వాడలోని రాజ్‌ పాకాల ఫాంహౌ్‌సపై దాడులు నిర్వహించారు. పోలీసుల సోదాల్లో విదేశీ మద్యంతో పాటు క్యాసినో ఆట వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురికి డ్రగ్‌ పరీక్షలు నిర్వహించారు. పార్టీలో అనుమతి లేకుండా వినియోగిస్తున్న విదేశీ మద్యం 7.6 లీటర్లు, ఐఎంఎ్‌ఫఎల్‌ మద్యం 8.1 లీటర్లు, బీర్లు 6 లీటర్లను స్వాధీనం చేసుకున్నారు. పార్టీలో 22 మంది పురుషులు, 16 మంది మహిళలు పాల్గొన్నారు. వీరందరికీ అక్కడే డ్రగ్‌ టెస్టులు చేసేందుకు ప్రయత్నించగా మహిళలు నిరాకరించారు. అయితే పురుషులందరికీ డ్రగ్‌ టెస్టులు నిర్వహించగా విజయ్‌ మద్దూరికి పాజిటివ్‌ వచ్చింది. విజయ్‌ తొలుత మూత్ర పరీక్షకు సహకరించలేదు. పోలీసులను ముప్పతిప్పలు పెట్టారు.


తర్వాత పోలీసులు మూత్రంతో పాటు రక్తపరీక్షలు కూడా నిర్వహించారు. చివరకు పాజిటివ్‌ రావడంతో తాను ఇటీవలే విదేశాల నుంచి వచ్చానని, అక్కడ కొకైన్‌ తీసుకుని ఇండియాకు వచ్చానని విజయ్‌ పోలీసులను తప్పుదోవ పట్టించే యత్నం చేశాడు. మూత్ర పరీక్షలో పాజిటివ్‌ రావడంతో అతని గుట్టురట్టయింది. డ్రగ్స్‌ తీసుకుంటే 24 గంటల్లోపు అయితేనే మూత్ర పరీక్షలో తేలుతుంది. అంతకు మించితే రక్తపరీక్షలు చేస్తారు. గోళ్లు, వెంట్రుకల్లో డ్రగ్స్‌ ఆనవాళ్లు 3 నుంచి 6 నెలల దాకా ఉంటాయని నిపుణులు తెలిపారు.మూత్ర పరీక్షలోనే పాజిటివ్‌గా రావడంతో విజయ్‌ను అదుపులోకి తీసుకున్న మోకిల పోలీసులు... ఎన్‌డీపీఎ్‌స సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. మిగిలిన వారి వివరాలు తీసుకొని వదిలేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సత్తెనపల్లిలో హై టెన్షన్.. టీడీపీ vs వైసీపీ..

అది జగన్ చేతకానితనానికి నిదర్శనం: షర్మిల

ఆస్టిన్ పర్యటనలో మంత్రి లోకేష్

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 28 , 2024 | 12:24 PM