Ramoji Rao: అధికారిక లాంఛనాలతో రామోజీ అంత్యక్రియలు
ABN, Publish Date - Jun 08 , 2024 | 09:59 AM
ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు మృతిపై పలువురు ప్రముఖుల సంతాపం వ్యక్తం చెబుతున్నారు. రామోజీ రావు మృతి దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయ పడ్డారు. తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత, తెలుగు పారిశ్రామిక రంగానికి విలువలు జోడించారని గుర్తుచేశారు. రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని ప్రకటించారు.
హైదరాబాద్: ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు (Ramoji Rao) మృతిపై పలువురు ప్రముఖుల సంతాపం వ్యక్తం చెబుతున్నారు. రామోజీ రావు మృతి దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయ పడ్డారు. తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత, తెలుగు పారిశ్రామిక రంగానికి విలువలు జోడించారని గుర్తుచేశారు. రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని ప్రకటించారు. రామోజీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీచేశారు. సీడబ్ల్యూసీ సమావేశంలో కోసం రేవంత్ ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ కమిషనర్‌కు సీఎస్ ఆదేశాలు జారీచేశారు.
Updated Date - Jun 08 , 2024 | 10:00 AM