Jani Master: జానీ మాస్టర్‌కు రంగారెడ్డి కోర్టులో చుక్కెదురు..
ABN, Publish Date - Oct 14 , 2024 | 07:00 PM
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు రంగారెడ్డి జిల్లా కోర్టులో చుక్కెదురు అయ్యింది. బెయిల్‌పై తనను విడుదల చేయాలంటూ జానీ వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.
హైదరాబాద్: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్(Jani Master)కు రంగారెడ్డి జిల్లా కోర్టు(Rangareddy District Court)లో చుక్కెదురు అయ్యింది. బెయిల్‌పై తనను విడుదల చేయాలంటూ జానీ వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. బాధితురాలిని, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని అభిప్రాయపడిన కోర్టు ఆయనకు రెగ్యులర్ బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. మహిళా కొరియోగ్రాఫర్‌పై అత్యాచారం, బెదిరింపుల కేసులో జానీ మాస్టర్‌ను నార్సింగి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే తనకు నేషనల్ అవార్డు వచ్చిందని, అక్టోబర్ 8న అవార్డు తీసుకునేందుకు బెయిల్ ఇవ్వాలని ఆయన ఇటీవల రంగారెడ్డి జిల్లా కోర్టును ఆశ్రయించారు.
ఈ మేరకు అక్టోబర్ 6నుంచి 10వరకూ జానీ మాస్టర్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయితే లైంగిక ఆరోపణల నేపథ్యంలో జానీకి అవార్డును కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. తాజాగా ఆయన మళ్లీ తనకు బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ(సోమవారం) విచారణ చేపట్టిన రంగారెడ్డి కోర్టు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. సాక్ష్యులను ప్రభావితం చేస్తారనే నార్సింగి పోలీసుల వాదనతో ఏకీభవించింది. అలాగే ఆయనకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని ప్రతివాదుల వాదన మేరకు దాన్నీ రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం చంచల్ గూడ జైలులో జానీ మాస్టర్ ఉన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
TG RTC Bus: ఆర్టీసీ ఛార్జీల పెంపు దుమారం
Minister Sitakka: ప్రైవేట్ ఉద్యోగాల్లో వారికి ఉద్యోగాలు
Updated Date - Oct 14 , 2024 | 07:01 PM