ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Road Accident: హైదరాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం..

ABN, Publish Date - Aug 11 , 2024 | 08:59 AM

భాగ్యనగరం శివారులోని నార్సింగిలో నిత్యం రోడ్డు ప్రమాదాలు (Road Accident) జరుగుతూనే ఉన్నాయి. తాజాగా.. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్ లారీని వేగంగా వచ్చిన కారు ఢీ కొన్నది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులతో పాటు..

హైదరాబాద్: భాగ్యనగరం శివారులోని నార్సింగిలో నిత్యం రోడ్డు ప్రమాదాలు (Road Accident) జరుగుతూనే ఉన్నాయి. తాజాగా.. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్ లారీని వేగంగా వచ్చిన కారు ఢీ కొన్నది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులతో పాటు టిప్పర్ లారి డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం తెల్లవారుజామున మై హోమ్ అవతార్ జంక్షన్ వద్ద 4:30 గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గంట పాటు తీవ్రంగా శ్రమించిన పోలీసులు.. గాయపడ్డ వారిని కారులో నుంచి బయటికి తీశారు. క్షతగాత్రులను హుటాహుటిన స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించిన పోలీసులు చికిత్స అందిస్తున్నారు. కారు మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమణమని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.


ఎవరు.. ఎందుకిలా..!?

ప్రమాదంలో గాయపడిన వారిని సిరి, గౌతమ్, సుధీప్‌లుగా పోలీసులు గుర్తించారు. ఈ ముగ్గురు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నట్లు తేలింది. గచ్చిబౌలి నుంచి నార్సింగ్ మై హోమ్ అవతార్ మీదుగా ప్రయానిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన వారు ప్రస్తుతం స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా.. టిప్పర్ లారీ నంబర్ TS 31 TA 6776.. లారీ డ్రైవర్ పేరు సతీష్. థార్ కారు నంబర్ TS 09 EQ 1512 అని పోలీసులు మీడియాకు వెల్లడించారు. ఈ నలుగురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. రెండ్రోజుల క్రితమే.. ఔటర్ రింగ్ రోడ్డుపై గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఓ యువకుడు మృతి చెందిన విషయం తెలిసిందే. రంగారెడ్డి జిల్లా నార్సింగి ఔటర్ రింగు రోడ్డుపై జరిగిన ఈ ప్రమాదాన్ని హిట్ అండ్ రన్ కేసుగా పోలీసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


నెల క్రితమే ఇలా..!

ఇదిలా ఉంటే.. నెల రోజుల క్రితం ఇదే నార్సింగి పరిధిలో స్నేహితుడి మాటలు విని కారును 120 కిలోమీటర్ల వేగంతో నడపడంతో.. తల్లీకుమార్తె దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం పెను సంచలనమే అయ్యింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. అయితే.. తెల్లవారుజామున రోడ్లపై పెద్దగా ట్రాఫిక్ ఉండదని, కాబట్టి వేగంగా వెళ్తే ఆ మజానే వేరని స్నేహితుడు బనోత్ గణేశ్ చెప్పడంతో ఖాద్రీ 120 కిలోమీటర్ల వేగంతో వెళ్లడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. ఇలాంటి ప్రమాదాలు ఒకటా రెండా రోజుకొకటి జరుగుతూనే ఉన్నాయి.

Updated Date - Aug 11 , 2024 | 08:59 AM

Advertising
Advertising
<