Road Accident: ఆ కోరిక తీరకుండానే మా అమ్మా నాన్న చనిపోయారు..
ABN, Publish Date - Dec 01 , 2024 | 12:09 PM
లంగర్‌హౌస్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మోనా ఠాకూర్, దినేష్‌కు ఇద్దరూ పిల్లలు ప్రేరణ శ్రీ, ధృతి శ్రీ.. ఈ సందర్భంగా ఆదివారం ఆ పిల్లలు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. శనివారం సాయంత్రం గోవా నుంచి తమ అమ్మానాన్నలతో హైదరాబాద్‌కు వచ్చామన్నారు. బంధువులకు బాలేక పోతే అమ్మా నాన్న మమ్మల్ని ఇంట్లో ఉంచి వెళ్లారని, తర్వాత రోడ్డు ప్రమాదం జరిగిందని తమకు సమాచారం ఇచ్చారని కన్నీటిపర్యంతమయ్యారు.
హైదరాబాద్: నగరంలోని లంగర్‌హౌస్ (Langar House)లో స్విఫ్ట్ కారు (Swift car) బీభత్సం సృష్టించింది. అతి వేగంతో వచ్చిన కారు ఓ బైక్ (Bike), ఆటో (Auto)ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళుతున్న దంపతులు ఇద్దరూ మృతి చెందారు. ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కారు డ్రైవర్ వికారాబాద్ జిల్లా, మోద్కురుకు చెందిన ప్రణయ్‌గా పోలీసులు గుర్తించారు.
ప్రమాదంలో మృతి చెందిన మోనా ఠాకూర్, దినేష్‌కు ఇద్దరూ పిల్లలు ప్రేరణ శ్రీ, ధృతి శ్రీ.. ఈ సందర్భంగా ఆదివారం ఆ పిల్లలు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. శనివారం సాయంత్రం గోవా నుంచి తమ అమ్మానాన్నలతో హైదరాబాద్‌కు వచ్చామన్నారు. బంధువులకు బాలేక పోతే అమ్మా నాన్న మమ్మల్ని ఇంట్లో ఉంచి వెళ్లారని, తర్వాత రోడ్డు ప్రమాదం జరిగిందని తమకు సమాచారం ఇచ్చారని కన్నీటిపర్యంతమయ్యారు. సంఘటన స్థలానికి వెళ్లి చూసేసరికి తల్లిదండ్రులు రక్తపు మడుగుల్లో పడిపోయి ఉన్నారని, వాళ్లు లేరు అన్న విషయాన్ని తాను, తన చెల్లి తట్టుకోలేకపోతున్నామని అన్నారు. వారిని విగత జీవులుగా చూసి తట్టుకోలేక పోయామని, తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని వాపోయారు. తల్లిదండ్రులు తమతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారని, తాను పైలెట్ కావాలని అమ్మ కోరికని, తనను పైలట్ డ్రెస్‌లో చూడాలని అనుకున్నదని.. ఆ కోరిక తీరకుండానే అమ్మానాన్న చనిపోయారని కన్నీటిపర్యంతమయ్యారు. ‘‘మా అమ్మ నాన్నలను చంపిన వాళ్లని చంపేయాలి.. పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను చేస్తే ఈరోజు మా తల్లిదండ్రులు మాకు దూరం అవ్వకుండా ఉండేవారు.. మా తల్లిదండ్రుల కోరిక మేరకు ఉన్నత స్థానాలను ఎదుగుగుతాం.. మాకు న్యాయం జరగాలి’’ అంటూ పిల్లలు మాట్లాడారు.
కాగా ప్రమాదంలో మృతి చెందిన దినేష్ గోస్వామి, మోనా ఠాకూర్‌ల మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మద్యం మత్తులో కారు నడిపినట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. డ్రైవర్‌కు పోలీసులు డ్రంక్ డ్రైవన్ నిర్వహించగా మద్యం సేవించినట్లు నిర్దారణ అయింది. ఆటో రిక్షాలో ఉన్న మరో నలుగురికి తీవ్ర గాయాలు కాగా, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కాగజ్‌నగర్, సర్పూర్ టీ మండలాల్లో 144 సెక్షన్
సస్పెండైన ఏఈఈ నిఖేష్ కుమార్ బాగోతం..
అవినాష్ రెడ్డి బాధితుడికి కూటమి ప్రభుత్వం న్యాయం..
స్టెల్లా షిప్‌కు నో డ్యూ సర్టిఫికెట్‌కు నిరాకరణ
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Dec 01 , 2024 | 12:09 PM