Home » Dead Pixels
లంగర్‌హౌస్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మోనా ఠాకూర్, దినేష్‌కు ఇద్దరూ పిల్లలు ప్రేరణ శ్రీ, ధృతి శ్రీ.. ఈ సందర్భంగా ఆదివారం ఆ పిల్లలు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. శనివారం సాయంత్రం గోవా నుంచి తమ అమ్మానాన్నలతో హైదరాబాద్‌కు వచ్చామన్నారు. బంధువులకు బాలేక పోతే అమ్మా నాన్న మమ్మల్ని ఇంట్లో ఉంచి వెళ్లారని, తర్వాత రోడ్డు ప్రమాదం జరిగిందని తమకు సమాచారం ఇచ్చారని కన్నీటిపర్యంతమయ్యారు.
కలుషిత ఆహారం తినడంతో తీవ్ర అస్వస్థతకు గురైన గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థిని చౌదరి శైలజ (14) సోమవారం సాయంత్రం మృతి చెందింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువుతు న్న 20 మంది విద్యార్థులు.. అక్టోబరు 30న పాఠశాలలో వాంతులు విరేచనాలతో అ స్వస్థతకు గురైన సంగతి తెలిసిందే.
నంద్యాల జిల్లా: శ్రీశైలం రిజర్వాయర్‌లో చేపలు మృత్యువాత పడ్డాయి. శ్రీశైలం డ్యామ్ ముందు భాగంలోని పెద్ద బ్రిడ్జ్ పక్కన గేజింగ్ మడుగులో కుప్పలు తెప్పలుగా భారీగా చేపలు మృతి చెందాయి. శ్రీశైలం రిజర్వాయర్‌లోని ముందు బాగంలో వాటర్ రంగు మారింది.
హైదరాబాద్: ఈనెల 11వ తేదీన ఎల్బీనగర్, చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో నాగోల్ ఫ్లైఓవర్‌పై సెల్ఫ్ స్కిడ్ అయి పడిపోయిన ఎల్బీనగర్ షీ టీం ఏఎస్ఐ రాజేందర్ రెడ్డి చికిత్ పొందుతూ రాత్రి మృతి చెందారు.
మేడ్చల్ జిల్లా: జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి చింతల్లో చనిపోయిన మహిళ మృతదేహం మూడు రోజులుగా ఇంట్లోనే ఉంది. కుటుంబసభ్యులు పార్ధివ దేహానికి అంత్యక్రియలు చేయలేదు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రంగారెడ్డి జిల్లా: చేవెళ్ల మండలం, ఆలూరు స్టేజి వద్ద హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. కారు చెట్టును ఢీ కొంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. వివిధ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులని సమాచారం.