ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Sakshi Bad Manner: సొమ్ము చేసుకోవాలనుకుని, అడ్డంగా బుక్కై.. తోక ముడిచిన 'సాక్షి'

ABN, Publish Date - Oct 07 , 2024 | 07:34 PM

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ట్యాగ్ వాడి అడ్డంగా దొరికిన సాక్షి మీడియా తోక ముడిచింది. తమ వెబ్ సైట్ నుంచి సైలంట్‌గా ‘ఆంధ్రజ్యోతి’ ట్యాగ్ తీసి వేసింది. ఏమి ఏరగనట్టు కలరింగ్ ఇస్తోంది.

Sakshi Media Back Step

హైదరాబాద్: విలువలకు సాక్షి మీడియా తిలోదకాలు వదిలింది. సాక్షి వెబ్ సైట్‌లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ట్యాగ్ ఉపయోగించి వార్తలను పబ్లిష్ చేసింది. నిజానికి.. ఒక సంస్థ మరో సంస్థకు సంబంధించిన ఏ సమాచారాన్ని వాడొద్దు. విశ్వసనీయతే ప్రధాన అజెండాగా జర్నలిజంలో తనదైన మార్క్ చూపిస్తున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వెబ్‌సైట్‌ ఇటీవలి కాలంలో భారీగా ప్రజాదరణ పొందుతోంది. అయితే ఏబీఎన్‌కు ఉన్న ఈ ఆదరణను తమవైపునకు తిప్పుకోవాలని సాక్షి కుట్రలకు తెరలేపింది. అలా.. ఏబీఎన్ ట్యాగ్ వాడి, తమ సొంత వార్తలను ప్రమోట్ చేసుకుంది. ఈ విషయాన్ని ఆంధ్రజ్యోతి ఐటీ బృందం పసిగట్టింది. సాక్షి కుట్రను ఎండగడుతూ.. వరస వార్తా కథనాలు ప్రసారం చేసింది. ఈ అంశంపై ప్రజల్లోనూ వ్యతిరేకతను ఎదుర్కొన్న సాక్షి చడీచప్పుడు లేకుండా ట్యాగ్ తమ సైట్ నుంచి రిమూవ్ చేసింది. తామేం తప్పు చేయలేదన్నట్టు నిశబ్ధంగా సైడ్ అయింది. పైగా అక్రమంగా ట్యాగ్ వాడినందుకు క్షమాపణ కూడా చెప్పలేదు. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగినట్టు తప్పు చేసి, ఏం చేయలేదనేలా కవరింగ్ ఇచ్చుకోవడం గమనార్హం.



విలువలకు తిలోదకాలు..

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిజిటల్ యూజర్లకు ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందజేస్తోంది. కచ్చితమైన సమాచారం ఇవ్వడంతో రోజు రోజుకు ఆదరణ పెరుగుతోంది. వెబ్ సైట్‌కు వీక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది. ఈ విషయాన్ని సాక్షి పసిగట్టింది. ఎలాగైనా సరే ఆంధ్రజ్యోతి ట్రాఫిక్‌కు కళ్లెం వేయాలని తమ సైట్‌లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ట్యాగ్‌ను ఉంచి.. ఏబీఎన్ అని గూగుల్‌లో వెతికినా.. వీక్షకులు సాక్షి వెబ్‌సైట్‌కు రీడైరెక్ట్ అయ్యేలా చేసింది. అలా సాక్షి ప్రచురించే విశ్వసనీయత లేని వార్తలను బలవంతంగా ఎక్కించేందుకు కుట్రలు పన్నింది. ఈ వ్యవహారం జనాలను సైతం గందరగోళానికి గురిచేసింది. పైగా క్షమాపణ చెప్పకుండా.. తమ విలువలకు తిలోదకాలు దిద్దింది.



దమ్మున్న జర్నలిజం

తొలి నుంచి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అంటేనే దమ్మున్న జర్నలిజం అని ప్రజాబాహుల్యంలో ఉంది. దాన్ని అక్రమంగా క్యాష్ చేసుకుని చూడాలని సాక్షి భావించింది. అంతటితో ఆగకుండా ఆంధ్రజ్యోతి వీక్షకుల సంఖ్యను తగ్గించాలని కుట్ర పన్నడం సాక్షి జర్నలిజం విలువలను తెలియజేస్తోంది. సాక్షి అండ్ కో ఎంత నీచంగా ఆలోచించినప్పటికీ తెలుగు మీడియాలో ఆంధ్రజ్యోతి స్థానం పదిలం. సాక్షి మీడియా ఇలాంటి చర్యలకు పాల్పడినప్పటికీ పాఠకుల విశ్వాసం ఆంధ్రజ్యోతిపై రెట్టింపైంది తప్ప ఏమాత్రం తగ్గలేదు. ఆ విషయం తెలుసుకొని సాక్షి మరింత కడుపుమంటతో రగిలిపోతోంది. చేసిన తప్పుకు సాక్షి మీడియా వెంటనే భేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేదంటే ఆంధ్రజ్యోతి న్యాయపర చర్యలు తీసుకునేందుకు వెనకాడదు.

మరిన్ని తెలంగాణ, ఏపీ వార్తల కోసం

Updated Date - Oct 07 , 2024 | 09:08 PM