ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Congress: ఓటమి జీర్ణించుకోలేకనే ఆ మాటలు: సంపత్

ABN, Publish Date - Feb 05 , 2024 | 09:42 PM

ఓటమి జీర్ణించుకోలేక మాజీ మంత్రి కేటీఆర్ ఏదేదో మాట్లాడుతున్నాడని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్(Sampath Kumar) అన్నారు.

హైదరాబాద్: ఓటమి జీర్ణించుకోలేక మాజీ మంత్రి కేటీఆర్ ఏదేదో మాట్లాడుతున్నాడని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్(Sampath Kumar) అన్నారు. గాంధీ భవన్‌లో సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ...ఓటమి తర్వాత కేటీఆర్ IQ కోల్పోయాడని విమర్శించారు. కేటీఆర్‌కు ఇదే లాస్ట్ వార్నింగ్ అన్నారు. కేటీఆర్ ఇంకోసారి నోరు జారితే బాగోదని హెచ్చరించారు. కేసీఆర్, కేటీఆర్ గతంలో మాట్లాడిన బూతులను వినిపించారు. కేసీఆర్, కేటీఆర్ మాట్లాడిన బూతులు ఏ రాష్ట్ర రాజకీయ నాయకుడు కూడా మాట్లాడలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాల్క సుమన్ ఎక్కడ గడ్డి వేస్తే అక్కడ మెస్తాడని ఎద్దేవా చేశారు. బాల్క సుమన్ బ్రోకర్, జోకర్ లాగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఓడిపోవడం మంచిదేనని కేటీఆర్ అంటున్నాడని.. వాళ్లకి జీవితాంతం మంచే జరగాలని కోరుకుంటున్నానని అన్నారు.

సుమన్ భాష మార్చుకో: ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

బాల్క సుమన్‌పై చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నువ్వు బాల్క సుమన్ కాదు..బానిస సుమన్‌వి’ అని ఆరోపించారు. అతన్ని చెన్నూర్ ప్రజలు చెప్పుతో కొట్టారన్నారు. ఓయూ విద్యార్థులు కూడా ఆయనను చెప్పు దెబ్బలు కొడతారని హెచ్చరించారు. అతన్ని తరిమి కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని వార్నింగ్ ఇచ్చారు. సుమన్ భాష మార్చుకో..లేక పోతే దెబ్బలు తప్పవని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

వీళ్లంతా రోడ్లపై తిరిగేవారా..?: ప్రీతం

సోనియా తెలంగాణ ఇవ్వకపోతే వీళ్లంతా అడుక్కు తినేవాళ్లని ఎస్సీ సెల్ అధ్యక్షుడు ప్రీతం అన్నారు. బాల్క సుమన్ ఓ బచ్చగాడని ఆరోపించారు. తాము చెప్పులు చూపిస్తే... కేసీఆర్, కేటీఆర్, కవిత రోడ్లపై తిరిగేవారా? అని ప్రీతం ప్రశ్నించారు.

Updated Date - Feb 05 , 2024 | 09:42 PM

Advertising
Advertising