ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TS News: టానిక్‌ లిక్కర్ గ్రూప్స్‌పై రైడ్స్.. సంచలన విషయాలు వెలుగులోకి..!

ABN, Publish Date - Mar 05 , 2024 | 04:54 PM

నగరంలో గత రెండు రోజుల నుంచి జీఎస్టీ అధికారులు(GST Officials) తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏ మద్యం షాపునకు లేని వెసులుబాటు టానిక్‌ లిక్కర్ గ్రూప్స్‌(Tonic Liquor Groups)కు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం టానిక్‌ గ్రూప్స్‌కు ఏ4 ఎలైట్ కింద లైసెన్స్ జారీ చేసింది.

హైదరాబాద్: నగరంలో గత రెండు రోజుల నుంచి జీఎస్టీ అధికారులు (GST Officials) తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏ మద్యం షాపునకు లేని వెసులుబాటు టానిక్‌ లిక్కర్ గ్రూప్స్‌ (Tonic Liquor Groups) కు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం టానిక్‌ గ్రూప్స్‌కు ఏ4 ఎలైట్ కింద లైసెన్స్ జారీ చేసింది. రాష్ట్రంలో ఎక్కడా లేని ఎలైట్ అనుమతులు కేవలం టానిక్‌ బ్రాండ్‌కు గత ప్రభుత్వంలో అధికారులు కేటాయించారు. ఇది ఎక్సైజ్ పాలసీకి విరుద్ధంగా ఉందని అధికారులు చెబుతున్నారు. ముందుగా పాలసీలో ఇలాంటి అనుమతి నోటిఫై చేయలేదని పలువురు వైన్ షాప్ నిర్వాహకులు వాదనను వినిపిస్తున్నారు.

అయితే ప్రస్తుతం నగరంలో టానిక్‌ లిక్కర్ గ్రూప్స్‌కు 11 ఫ్రాంచైజ్‌లు ఉన్నాయి. క్యూ బై టానిక్ పేరుతో సదరు సంస్థ మద్యం విక్రయాలు చేస్తోంది. ప్రత్యేక అనుమతులు టానిక్‌ గ్రూప్స్‌కు ఉన్నట్టు గుర్తించి జీఎస్టీ (GST) అధికారులు సోదాల్లో కంగుతిన్నారు. జీఎస్టీ అధికారుల తనిఖీల్లో టానిక్‌ గ్రూప్స్‌కు సంబంధించి సంచలన విషయాలు బయటపడుతున్నాయి. 11 క్యూ టానిక్ సిండికేట్లను అనిత్ రెడ్డి, అఖిల్ రెడ్డి అనే వ్యక్తులు నడిపించినట్లు అధికారులు గుర్తించారు. టానిక్‌ లిక్కర్ గ్రూప్స్‌ సిండికేట్‌కు సంబంధించి బోడుప్పల్, గచ్చిబౌలి, మాదాపూర్‌లో ముగ్గురు ఉన్నతాధికారుల కుటుంబ సభ్యుల పాత్ర ఉన్నట్లు గుర్తించారు. మాజీ సీఎంవో అధికారి భూపాల్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి, ఎక్స్‌జ్ ఉన్నతాధికారి కూతురు, మరో అడిషనల్ ఎస్పీ కూతురు ప్రియాంక రెడ్డిలకు టానిక్‌ లిక్కర్ గ్రూప్స్‌ సిండికేట్‌‌లో భాగస్వామ్యం ఉన్నట్లు జీఎస్టీ అధికారులు గుర్తించారు.

ఇవి కూడా చదవండి...

TS News: తెలంగాణలో మరో స్కామ్.. బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్లను వదలని వైనం..

TS News: పోలీస్ స్టేషన్‌లో హత్య కేసు నిందితుడికి బర్త్ డే వేడుకలా.. ఏంటిది ఎస్సైగారూ..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 05 , 2024 | 04:59 PM

Advertising
Advertising