Panjagutta PS: హైదరాబాద్ సీపీ సంచలన నిర్ణయం.. పంజాగుట్ట పీఎస్ ప్రక్షాళన
ABN, Publish Date - Jan 31 , 2024 | 12:23 PM
Telangana: హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ను ప్రక్షాళన చేస్తూ సీపీ ఆదేశాలు జారీ చేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సిబ్బంది మొత్తాన్ని మార్చేస్తూ సీపీ నిర్ణయం తీసుకున్నారు.
హైదరాబాద్, జనవరి 30: హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి (Hyderabad CP Kothakota Srinivasreddy) సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ను ప్రక్షాళన చేస్తూ సీపీ ఆదేశాలు జారీ చేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సిబ్బంది మొత్తాన్ని మార్చేస్తూ సీపీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇన్‌స్పెక్టర్ నుంచి హోంగార్డు వరకు మొత్తం 85 మంది సిబ్బందిని హైదరాబాద్ సీపీ బదిలీ చేశారు. భోదన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ వ్యవహారంతో పాటు కీలకమైన విషయాలు బయటకు పొక్కడంపై సీపీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మాజీ ప్రభుత్వ పెద్దలకు సమాచారం చేరవేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సిబ్బంది మొత్తంపై బదిలీ వేటు పడింది. పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు కొత్త సిబ్బందిని సీపీ కేటాయించారు. నగరంలోని వివిధ పోలీస్‌స్టేషన్ల నుంచి పంజాగుట్ట పీఎస్‌కు కొత్త సిబ్బంది నియమించారు. ఒకే పోలీస్‌స్టేషన్ నుంచి 85 మంది సిబ్బందిని బదిలీ చేయడం ఇదే మొదటి సారి. ఇప్పటికే 82 మందికి కొత్తగా పోస్టింగ్‌లు ఇచ్చారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
Updated Date - Jan 31 , 2024 | 12:34 PM