Telangana: శివబాలకృష్ణ విచారణలో విస్తుపోయే నిజాలు..
ABN, Publish Date - Feb 15 , 2024 | 08:26 PM
HMDA Shiva Balakrishna Case: ఆకమాస్తుల కేసులో ఏసీబీ అధికారుల కస్టడీలో ఉన్న శివబాలకృష్ణను విచారిస్తున్నా కొద్ది సంచలన నిజాలు వెలుగు చూస్తున్నాయి. హెచ్ఎండీఏలో తొమ్మిదేళ్లుగా కింగ్ మేకర్‌గా ఉన్నాడు శివబాలకృష్ణ. తాజాగా విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం..
హైదరాబాద్, ఫిబ్రవరి 15: ఆకమాస్తుల కేసులో ఏసీబీ అధికారుల కస్టడీలో ఉన్న శివబాలకృష్ణను విచారిస్తున్నా కొద్ది సంచలన నిజాలు వెలుగు చూస్తున్నాయి. హెచ్ఎండీఏలో తొమ్మిదేళ్లుగా కింగ్ మేకర్‌గా ఉన్నాడు శివబాలకృష్ణ. తాజాగా విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం.. అరవింద్ కుమార్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా, హెచ్ఎండీఏ కమిషనర్‌గా రావడంతో వసూళ్లతో రెచ్చిపోయాడు బాలకృష్ణ. హెచ్ఎండీఏ లో డబుల్ రోల్-డబుల్ క్యాష్ పద్ధతిలో బిల్డర్లకు, రియల్టర్లకు, ఇన్‌ఫ్రా ఓనర్లకు, ల్యాండ్ వెంచర్ల యజమానుల ఫైల్స్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
అరవింద్ కుమార్‌తో కలిసి డబుల్ డీల్స్ సెట్ చేశాడు శివబాలకృష్ణ. HMDA లో ప్లానింగ్ డైరక్టర్‌గా శివబాలకృష్ణ.. కమీషనర్‌గా అరవింద కుమార్ ఇద్దరూ రెచ్చిపోయారు. అయితే, MAUD లో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా అరవిందకుమార్.. అదే సచివాలయం MAUD లో డైరెక్టర్ హోదాలో బాలకృష్ణ ఉన్నారు. దీంతో ఒకే ఫైల్‌ను ఇద్దరు రెండు సార్లు రెండు హోదాలల్లో తిప్పుతూ డబుల్ ఇన్‌కమ్ పొందుతూ, ఫైల్ డబుల్ ప్రాసెస్ చేశారు. DTCP, GHMC లలో కూడా అరవింద్ కుమార్‌తో కలసి ఫైల్స్ క్లియర్ చేసిన డైరెక్టర్ లు, CCP లపై విచారణలో ఈ వివరాలన్నీ వెల్లడయ్యాయి.
Updated Date - Feb 15 , 2024 | 08:26 PM