ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Arrest: మెమోస్ తిని ఒకరు చనిపోయిన కేసులో ఆరుగురి అరెస్ట్..

ABN, Publish Date - Nov 01 , 2024 | 01:58 PM

కలుషిత మోమోస్‌ తిన్న కారణంగా రేష్మ బేగం అనే గృహిని మృతి చెందిన కేసులో పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. హైదరాబాద్ చింతల్ బస్తీలో మెమోస్ తయారు చేస్తున్న అల్మాస్‌ను అరెస్టు చేశారు. బీహార్ నుంచి వచ్చిన ఆతను.. చింతల బస్తీలో మెమోస్ తయారు చేస్తున్నాడు.

హైదరాబాద్: మెమోస్ (Memos) తిని ఓ గృహని (Women) చనిపోయిన (Died) కేసులో పోలీసులు (Police) ఆరుగురుని అరెస్టు (Arrest) చేశారు. హైదరాబాద్ చింతల్ బస్తీలో మెమోస్ తయారు చేస్తున్న అల్మాస్‌ను అరెస్టు చేశారు. బీహార్ నుంచి వచ్చిన అల్మాస్.. చింతల బస్తీలో మెమోస్ తయారు చేస్తున్నాడు. మెమోస్ తయారీకి నాసిరకం పదార్థాలు వాడడంతో ప్రమాదం సంభవించింది. నాసిరకంతో పాటు అపరిశుభ్రత విష పదార్థంగా మెమోస్ మారింది. బంజారా హిల్స్‌లో వారాంతపు సంతలో పెట్టిన మెమోస్‌ను రేష్మ బేగం అనే మహిళ కొనుక్కుని తినింది. తిన్న వెంటనే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆసుపత్రికి తరలించే లోపే ఆమె చనిపోయింది.

కాగా కలుషిత మోమోస్‌ కారణంగా రేష్మ మృతి చెందగా.. మరో 50 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. మూడు రోజుల క్రితం గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని 110 మోమోస్‌ తయారీ కేంద్రాలపై ముప్పేట దాడులు నిర్వహించి, తనిఖీ చేపట్టారు. అనుమతులు లేకుండా.. నిబంధనలకు విరుద్ధంగా కొన్ని ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లలో మోమోస్‌ను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. పురుగులు పట్టిన మైదా పిండి, కాలం చెల్లిన ముడిపదార్థాలను మోమోస్‌ తయారీకి వినియోగిస్తున్నట్లు నిర్ధారించారు. కొన్ని తయారీ కేంద్రాల్లో అపరిశుభ్రత, డ్రైనేజీ ఓవర్‌ఫ్లో వంటి పరిస్థితులను గుర్తించారు. 69 కేంద్రాల్లో మోమోస్‌ నమూనాలను సేకరించి, పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు. ల్యాబ్‌ నుంచి నివేదిక వచ్చాక.. సంబంధిత మోమోస్‌ తయారీ కేంద్రాల నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని అదనపు కమిషనర్‌ ఎస్‌.పంకజ వెల్లడించారు. కాగా.. బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో మోమోస్‌ తిని అస్వస్థతకు గురై, తన్వీర్‌, స్వాతి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని ఫుడ్‌ సేఫ్టీ అధికారులు పరామర్శించారు.


వారి నమూనాలను సేకరించి, ల్యాబ్‌కు తరలించారు. అస్వస్థతకు కలుషితమైన మోమోస్‌ కారణమా.. లేక అందులో వినియోగించిన మయోనైస్‌ కారణమా అనేది నివేదిక వచ్చాక తెలుస్తుందని అధికారులు వివరించారు. మరోవైపు.. కలుషిత మోమోస్‌ కేసులో బంజారాహిల్స్‌ పోలీసులు మరో ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. వీరంతా ఢిల్లీ మోమోస్‌ నుంచి ఆహార పదార్థాలను కొనుగోలు చేసి.. సంతల్లో విక్రయిస్తుంటారని పోలీసులు వివరించారు.

నోరూరించే చిరుతిండి వాళ్లను తీవ్ర అస్వస్థతకు గురిచేసింది. ఆ సంతలో విశేష ఆదరణ ఉన్న రుచికరమైన మోమోస్‌ కోసం పిల్లలు, యువకులు, మహిళలు అంతా ఎగబడ్డారు. తిన్నాక వాంతులు, విరేచనాలతో ఆస్పత్రి పాలయ్యారు. 50 మంది తీవ్ర అనారోగ్యానికి గురవగా, వారిలో ఓ మహిళ చికత్స పొందుతూ మృతిచెందింది. ఆ మాయదారి మోమోస్‌ను విక్రయించింది బంజారాహిల్స్‌ పరిధిలోని నందినగర్‌, సింగాడికుంట బస్తీలోని సంతలోనైతే బాధితులంతా ఆ పరిధిలోని నాలుగు బస్తీలకు చెందినవారు.


కేవలం రూ.30కే ఆరు మోమోస్‌ ఇస్తుండటంతో ఎప్పటిలాగే ఈసారి కూడా తినేందుకు పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. ఇంటికి వెళ్లాక మోమోస్‌ తిన్నవారిలో చాలామంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో పాటు కొందరు తీవ్రమైన కడుపునొప్పితో విలవిల్లాడిపోయారు. ఏం జరిగిందో తెలియక తీవ్ర ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు, బాధితులను సమీపంలోని ఆస్పత్రులకు తీసుకెళ్లారు. సింగాడికుంట బస్తీకి చెందిన రేష్మాబేగం ఆమె కుమార్తెలు రుష్మా, రఫీయా, కుమారుడు అబ్దుల్‌ రెహ్మాన్‌ కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మెడికల్‌ షాపు నుంచి మాత్రలు తెచ్చి వేసినా ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో మరుసటి రోజు వారిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రేష్మా బేగం మృతిచెందింది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏజెన్సీ అభివృద్ధిపై సీఎం ఫోకస్..

ఢిల్లీలో పెరిగిన కాలుష్యం..

హోంమంత్రి అనిత నివాసంలో దీపావళి సంబరాలు

సీఎం రేవంత్ రెడ్డిని వదిలి పెట్టను: కేటీఆర్

ఆ ప్రచారాన్ని నమ్మొద్దు: సీఎం సిద్ధరామయ్య

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Nov 01 , 2024 | 01:58 PM