Share News

Harsha Sai: మరో ఆడియో కలకలం.. ఓ యువతితో

ABN , Publish Date - Sep 28 , 2024 | 05:09 PM

యూట్యూబర్ హర్ష సాయి కేసులో రోజుకో కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. హర్ష సాయికి సంబంధించి ఓ ఆడియో తీవ్ర కలకలం రేపుతోంది. అందులో ఓ అమ్మాయి మాటలు ఉన్నాయి. కొందరు నేతల కోసం హర్ష సాయి బ్రోకర్ పనులు కూడా చేసినట్టు తెలుస్తోంది.

Harsha Sai: మరో ఆడియో కలకలం.. ఓ యువతితో
youtuber harsha sai

హైదరాబాద్: యూట్యూబర్ హర్ష సాయి (Harsha Sai) కేసులో రోజుకో విషయం వెలుగు చూస్తోంది. తాజాగా మరో ఆడియో బయటకు వచ్చింది. ఓ అమ్మాయి హర్షసాయితో మాట్లాడిన మాటలు వెలుగు చూశాయి. ఆ ఆడియో క్లిప్‌లో అమ్మాయి రాజకీయ నేతల గురించి మాట్లాడారు. హర్ష సాయి తనను ఇరికిస్తున్నాడని చెప్పుకొచ్చింది. స్వార్థం కోసం హర్ష సాయి బెట్టింగ్ యాప్, గేమింగ్ యాప్‌ల గురించి ప్రమోషన్ చేసి రూ.కోట్లలో సంపాదించిన సంగతి తెలిసిందే.


అమ్మాయి ఆడియో ఇలా..

హర్ష సాయి కేసులో మరో ఆడియో బయటకొచ్చింది. ఆ ఆడియోలో యువతి మాటలు తీవ్ర కలకలం రేపాయి. ‘నేను చాలామంది రాజకీయ నేతలను చూశా. పొలిటిషీయన్స్‌కు ఒక్కటే వీక్ నెస్. అది అమ్మాయిలు. నన్ను హోటల్ రూమ్‌కు తీసుకెళ్లేవారు. అక్కడ కాపలా పెట్టేవారు. హోటల్ గది నుంచి కొందరు గంటల్లో వచ్చేవారు. మరికొందరు రోజుల తరబడి ఉండేవారు. డబ్బులు వస్తున్నాయి కదా అని నేను అక్కడే వెయిట్ చేసేదానిని. చాలా మంది వాళ్ళ గర్ల ఫ్రెండ్స్‌ను తీసుకొచ్చేవారు. వాళ్లు అక్కడ ఉండగా నన్నే ఎందుకు ఇక్కడ ఉండమని చెప్పావని హర్షను అడిగా. అందుకు అతను చెప్పిన సమాధానం విని షాకయ్యా. ఏదైనా జరిగి, పోలీసులు వస్తే.. ఆ అమ్మాయిని సేవ్ చేసేందుకు నన్ను అక్కడ ఉంచారని చెప్పారు. నేను కూడా ఇరుక్కుంటానని చెబితే, అదేం లేదు.. కొన్ని కొన్ని చేయాల్సిందేనని నాతో చెప్పాడు అని’ ఆడియోలో యువతి అంటుంది.


స్వార్థం కోసం

యూట్యూబర్ హర్షసాయి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. యువత జీవితాలను బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ నాశనం చేస్తున్నాయి. దాంతో కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. అయినప్పటికీ తన స్వార్థం కోసం బెట్టింగ్ యాప్స్‌ను హర్ష సాయి ప్రమోషన్ చేశాడు. ఆ బెట్టింగ్ యాప్స్ నేను వాడానని ఫాలొవర్లను మోసం చేశాడు. మరికొందరి చేత అబద్దాలు చెప్పించాడు. దీంతో చాలా మంది బెట్టింగ్ యాప్స్ డౌన్ లోడ్ చేసుకున్నారు. బెట్టింగ్ యాప్స్ ఓపెన్ చేసిన తర్వాత కొందరికి డబ్బులు వచ్చాయి. తర్వాత డబ్బులు పోవడం మొదలైంది. అలా ఒక్కొక్కరు అలా నష్టపోయారు.


రూ.53 లక్షలు

లోటస్ 360 అనే బెట్టింగ్ యాప్‌కు హర్ష సాయి ప్రమోషన్ చేశారు. ఆ యాప్‌కు ప్రమోషన్ చేసి రూ.53 లక్షలు తీసుకున్నాడు. ఇలా మిగతా యాప్స్ నుంచి రూ.కోట్ల తీసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. 2022 ఏడాది నుంచి బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోషన్ చేసి కోట్లలో సంపాదించాడు. హర్ష సాయికి కొన్ని యూట్యూబ్ చానెల్స్ ఉన్నాయి. ఒక్కో చానెల్‌కు మిలియన్ వ్యూవర్స్ ఉన్నారు. బెట్టింగ్ యాప్‌ల గురించి హర్ష సాయి చెప్పిన విషయాలను సబ్ స్క్రైబర్లు నమ్మారు. యాప్ డౌన్ లోడ్ చేసుకొని బెట్టింగ్ పెట్టారు. భారీగా నష్ట పోయారు. ప్రమోషన్ వల్ల వచ్చిన డబ్బును వివిధ ప్రాంతాల్లో ఉన్న అకౌంట్లకు హర్ష సాయి తరలించారు. మనీ ల్యాండరింగ్ జరిగిందని కొందరు ఈడీకి ఫిర్యాదు చేశారు. దాంతో హర్ష సాయి మోసాలు వెలుగులోకి వచ్చాయి.


రూ.20 లక్షలు పొగొట్టుకున్నాడు

హర్ష సాయి మాటలు విని రూ.20 లక్షలు నష్టపోయాయని ఓ యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. చాలామంది మోస పోయారు. కొందరు అజాతంలోకి వెళ్లారు. మరికొందరు ఆత్మహత్య చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడానికి కారణం బెట్టింగ్ యాప్స్‌లో డబ్బులు పోవడమేనని తెలుస్తోంది. చాలామంది బయటకు రాలేదు. కొందరు ధైర్యం చేసి హర్ష సాయి గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు హర్ష సాయితో మూవీ తీసిన నిర్మాతలు ఆందోళన చెందారు. బెట్టింగ్ యాప్స్‌కు హర్ష సాయి ప్రమోషన్ చేయడం వల్ల తమ సినిమాపై ఎఫెక్ట్ చూపిస్తోందని చెబుతున్నారు. ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. హర్ష సాయి బాధితులు పదుల సంఖ్యలో ఉన్నారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి:

RB-X: ఈ మార్క్ చూస్తే వణుకుతున్న హైదరాబాదీలు..


Viral Video: వామ్మో.. ఇకపై టమాటాలు తినాలంటే ఆలోచించాలేమో.. ఈ పాము చేసిన నిర్వాకం చూడండి..


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Sep 28 , 2024 | 05:09 PM