ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

HMDA: శివబాలకృష్ణ కేసు దర్యాప్తులో సంచలనాలు.. మాజీ సీఎస్‌ ఆస్తులపైనా ఫోకస్

ABN, Publish Date - Jan 29 , 2024 | 10:35 AM

Telangana: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసు దర్యాప్తులో సంచలన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ఆస్తులపైనా ఏసీబీ దృష్టిసారించినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్, జనవరి 29: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ (HMDA Former Director ShivaBalakrishna) కేసు దర్యాప్తులో సంచలన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ (Former CS Somesh Kumar) ఆస్తులపైనా ఏసీబీ దృష్టిసారించినట్లు తెలుస్తోంది. రెరా సెక్రెటరీగా బాలకృష్ణ ఉన్న సమయంలో ఛైర్మన్‌గా సోమేష్ కుమార్ ఉన్నారు. ఆ సమయంలోనే యాచారంలో 25 ఎకరాలు సోమేష్ భార్య గ్యాన్ ముద్ర పేరుతో రిజిస్టర్ అయినట్లు అధికారులు గుర్తించారు. యాచారంలోని సర్వే 249, 260లోని వ్యవసాయ భూమి సోమేష్ కుమార్ భార్య పేరుపై రిజిస్టర్ అయినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ల్యాండ్‌పై ఏసీబీ వివరాలు సేకరించే పనిలో పడింది. బాలకృష్ణతో లాభాలు పొందిన అధికారుల చిట్టాను ఏసీబీ బయటకు తీస్తోంది. సోమేష్ కుమార్‌కు 25 ఏకరాల భూమి ఎలా వచ్చిందన్న దానిపై ఏసీబీ దర్యాప్తు చేపట్టింది.


నేడు కస్టడీ పిటిషన్‌పై విచారణ

కాగా.. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్‌ అయిన శివబాలకృష్ణ ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్నారు. ఆయనకు ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అయితే బాలకృష్ణను వారం రోజుల పాటు కస్టడీ కోరుతూ ఏసీబీ అధికారులు కోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఈరోజు కస్టడీపై నాంపల్లి కోర్టులో విచారణ జరుగనుంది. శివబాలకృష్ణ పేరుపై నాలుగు అకౌంట్స్ ఎస్‌బీఐ బ్యాంక్‌లో ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. కస్టడీకి కోర్టు అనుమతిస్తే.. శివబాలకృష్ణ లాకర్స్ తెరిచేందుకు ఏసీబీ అధికారులు యత్నిస్తున్నారు. శివబాలకృష్ణ ఆమోదించిన ఫైల్స్, బినామీ ఆస్థులపైనా ఏసీబీ మరింత దృష్టిసారించింది. ఆయన అరెస్టుతో హెచ్‌ఎండీఏలో పనిచేస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారుల్లో ఆందోళన మొదలైంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 29 , 2024 | 11:04 AM

Advertising
Advertising