Share News

KCR: కోలుకున్న కేసీఆర్.. ఎలా నడుస్తున్నారో చూసేయండి..!

ABN , Publish Date - Jan 17 , 2024 | 08:13 PM

హైదరాబాద్, జనవరి 17: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. గాయం నుంచి మెల్ల మెల్లగా కోలుకుంటున్నారు. తాజాగా కేసీఆర్‌ ఆరోగ్యానికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మొన్నటి వరకు బెడ్‌కే పరిమితం అయిన కేసీఆర్.. ఇప్పుడు నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తున్నారు.

KCR: కోలుకున్న కేసీఆర్.. ఎలా నడుస్తున్నారో చూసేయండి..!
KCR Walking Video

హైదరాబాద్, జనవరి 17: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. గాయం నుంచి మెల్ల మెల్లగా కోలుకుంటున్నారు. తాజాగా కేసీఆర్‌ ఆరోగ్యానికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మొన్నటి వరకు బెడ్‌కే పరిమితం అయిన కేసీఆర్.. ఇప్పుడు నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తున్నారు. వైద్య సిబ్బంది సహాయంతో ఆయన నిదానంగా నడుస్తున్నారు. పక్కనే వైద్య సహాయకుడు ఉండగా.. ఊతకర్ర సాయంతో కేసీఆర్ మెల్లగా అడుగులు వేస్తూ నడుస్తున్నారు. ఇంటి హాల్ మొత్తం నడిచారు కేసీఆర్. ఊతకర్ర పట్టుకుని కేసీఆర్ నడుస్తుండగా.. తీసిన వీడియోను ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ షేర్ చేశారు. దీంతో వీడియో కాస్తా వైరల్ అయ్యింది. కేసీఆర్ త్వరగా కోలుకుంటున్నారని బీఆర్ఎస్ శ్రేణులు సంబరడిపోతున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకుని, ప్రజల్లోకి రావాలని కోరుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరెందుకు ఆలస్యం.. వీడియోను మీరూ చూసేయండి.

డిసెంబర్ 8న కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌లో కాలు జారి కింద పడగా.. తుంటి ఎముక విరిగిపోయింది. దాంతో వైద్యులు ఆయనకు శస్త్ర చికిత్స చేసి తుంటి ఎముక రీప్లేస్‌ చేశారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తరువాత 8 వారాల పాటు రెస్ట్ అవసరం అని వైద్యులు చెప్పగా.. హైదరాబాద్ నందినగర్‌లోని తన ఇంట్లో ఉంటూ రెస్ట్ తీసుకుంటున్నారు. వైద్యుల పర్యవేక్షణలో అవసరమైన చికిత్స తీసుకుంటూ, వ్యాయామం చేస్తూ త్వరగా కోలుకునే ప్రయత్నం చేస్తు్న్నారు కేసీఆర్. ఈ క్రమంలోనే.. ఇవాళ ఆయన నడుస్తున్న వీడియోను షేర్ చేశారు సంతోష్ కుమార్.

Updated Date - Jan 17 , 2024 | 08:36 PM