CM Revanth: పాదయాత్రకు సిద్ధమైన తెలంగాణ సీఎం
ABN, Publish Date - Nov 04 , 2024 | 03:23 PM
Telangana: పుట్టిన రోజు సందర్భంగా క్షేత్రస్థాయి పర్యటనలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలతో వరుసగా జిల్లా పర్యటనలు చేయనున్నారు. మూసీ పునరుజ్జీవ ప్రజా చైతన్య పాదయాత్ర మొదలుపెట్టనున్నారు. ఎమ్మెల్యే కుంభం అనిల్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి పాదయాత్ర చేయనున్నారు.
హైదరాబాద్, నవంబర్ 4: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో పాదయాత్ర చేసేందుకు సీఎం సిద్ధమయ్యారు. ఈ నెల 8న ముఖ్యమంత్రి పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. మూసీ పునరుజ్జీవం యాత్రతో మూసీ పరివాహక ప్రజల వద్దకు వెళ్లనున్నారు. తన జన్మదినం నవంబర్ 8 నుంచి క్షేత్ర స్థాయి పర్యటనలకు సీఎం శ్రీకారం చుట్టారు. అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలతో వరుసగా జిల్లా పర్యటనలు చేయనున్నారు సీఎం రేవంత్. యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి ముఖ్యమంత్రి పర్యటన షురూ కానుంది. ఈ నెల 8న కుటుంబ సమేతంగా యాదాద్రికి వెళ్లనున్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనారసింహుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు.
Harishrao: మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్
అనంతరం వైటీడీఏ (YTDA), జిల్లా అధికారులతో ఆలయ అభివృద్ధి పనులపై రేవంత్ సమీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని బొల్లేపల్లి, సంగెం, భీమలింగం వంతెన వరకు సీఎం రేవంత్ మూసీ పునరుజ్జీవన ప్రజా చైతన్య పాదయాత్ర చేయనున్నారు. ఎమ్మెల్యే కుంభం అనిల్ ఆధ్వర్యంలో పాదయాత్ర చేయనున్నారు సీఎం. తరువాత మల్లన్న సాగర్ నుంచి యాదాద్రి జిల్లాకు మంచినీటి సరఫరా కోసం నిర్మించనున్న పైప్ లైన్ ప్రాజెక్ట్ పనులకు శంకుస్థాపన చేస్తారు. సీఎం పర్యటన ఏర్పాట్లను ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పర్యవేక్షించనున్నారు.
కాగా.. ఇటీవల మూసీకి సంబంధించి బీఆర్‌ఎస్ నేతలకు సీఎం రేవంత్ సవాల్ విసిరిన విషయం తెలిసిందే. అధికారంలో ఉన్నప్పుడే బీఆర్‌ఎస్ నేతలు మూసీ పునరుజ్జీవనం కోసం ప్రయత్నాలు చేయడం, మూసీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు కూడా ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేకంగా ప్రాజెక్టు కోసం డిజైన్ కూడా చేశారు. అయితే ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మూసీ ప్రక్షాళనే తప్పు అన్నట్టుగా బీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న ఆందోళనను సీఎం తప్పుబట్టారు. మూసీ సుందరీకరణపై సూచనలు ఇవ్వాలని.. అంతేకానీ ఈ ప్రాజెక్టును అడ్డుకోవడం సమంజసం కాదన్నారు. మూసీ మురికిలో ఉండేందుకు ప్రజలెవరూ సుముఖంగా లేరన్నారు. అక్కడనున్న వారికి న్యాయం చేసేందుకు సూచనలు ఏమన్నా ఇవ్వాలని.. అంతే కానీ ఆందోళనలు చేయడం తగదన్నారు. ప్రజలంతా మూసీ ప్రక్షాళనను కోరుకుంటున్నారని తెలిపారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాడపల్లి నుంచి తాను చేస్తున్న పాదయాత్రకు కలిసి రావాలని.. నల్గొండ జిల్లా ప్రజలు మూసీ ప్రక్షాళనను కోరుకుంటున్నారా లేదా అని వారినే అడిగి తెలుసుకుందామని సవాల్ విసిరారు. అనట్లుగానే ఈనెల 8 నుంచి మూసీ పునరుజ్జీవన ప్రజా చైతన్య పాదయాత్రను చేసేందుకు సిద్ధమయ్యారు సీఎం రేవంత్.
సీఎంను కలిసిన కృష్ణయ్య
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాజీ ఎంపీ ఆర్.కృష్ణయ్య కలిశారు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో ఎంపీ ఆర్.కృష్ణయ్య,ఎమ్మెల్యే దానం నాగేందర్, ఫిషర్ మెన్ కమిషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, బీసీ సంఘం నేతలు.. ముఖ్యమంత్రిని కలిశారు. డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఆర్.కృష్ణయ్య, బీసీ సంఘం నేతలు. హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆర్.కృష్ణయ్య, బీసీ సంఘం నేతలు కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇవి కూడా చదవండి...
Gold and Silver Rates Today: ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Harish Rao: గ్రామాన్ని అభివృద్ధి చేసిన వారిని అరెస్ట్ చేస్తారా
Read Latest Telangana News And Telugu News
Updated Date - Nov 04 , 2024 | 03:41 PM