ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Allu Arjun Case: అల్లు అర్జున్‌కు ఏమైంది..? సీఎం షాకింగ్ కామెంట్స్..

ABN, Publish Date - Dec 21 , 2024 | 03:25 PM

సంథ్య థియేటర్ ఘటన విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం నాడు అసెంబ్లీలో ఈ అంశంపై ప్రత్యేకంగా మాట్లాడిన సీఎం..

CM Revanth Reddy

హైదరాబాద్, డిసెంబర్ 21: సంథ్య థియేటర్ ఘటన విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం నాడు అసెంబ్లీలో ఈ అంశంపై ప్రత్యేకంగా మాట్లాడిన సీఎం.. సంథ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కీసలాట ఘటనను తప్పు పడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సినీ నటుడిని అరెస్ట్ చేస్తే చాలా రాద్ధాంతం చేశారని.. అంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఏంటని సీఎం ప్రశ్నించారు. సంథ్య థియేటర్ ఘటనపై విచారణ కొనసాగుతోందన్నారు. డిసెంబర్ 2వ తేదీన పోలీసులకు సంథ్య థియేటర్ యాజమాన్యం బందోబస్తు కావాలంటూ దరఖాస్తు చేసిందని సీఎం వివరించారు. హీరో, హీరోయిన్, సినీ నిర్మాణ సిబ్బంది వస్తారని అందులో పేర్కొన్నట్లు చెప్పారు.


అయితే, థియేటర్ యాజమాన్యం చేసిన అభ్యర్థనను పోలీసులు తిరస్కరించారని సీఎం గుర్తు చేశారు. సంధ్య థియేటర్ పరిసరాల పరిస్థితుల దృష్ట్యా.. సెలబ్రిటీలకు భద్రత ఇచ్చే పరిస్థితి లేదని చెప్పారన్నారు. దరఖాస్తు తిరస్కరించినా సెలబ్రీటీలు థియేటర్‌కు వచ్చారన్నారు. ఈ విషయంలో అల్లు అర్జున్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ రోడ్‌ షో చేస్తూ థియేటర్‌కు వచ్చారని.. అభిమానులు ఎగబడటంతో తొక్కిసలాట జరిగిందని సీఎం రేవంత్ తెలిపారు.


ఈ తొక్కీసలాటలో రేవతి అనే మహిళ చనిపోయారని సీఎం వివరించారు. ఇదే ఘటనలో తీవ్రంగా గాయపడిన రేవతి కొడుకు చావుబతుకుల్లో ఉన్నాడన్నారు. ఇద్దరు చనిపోయారని పోలీసులు చెప్పినా సినిమా చూసి.. అల్లుఅర్జున్ రూప్‌టాప్‌పై చేతులు ఊపుతూ వెళ్లారంటూ సీఎం నిప్పులు చెరిగారు. బాధితులను పరామర్శించేందుకు కూడా హీరో వెళ్లలేదన్నారు. అల్లు అర్జున్‌కు ఏమైందని.. సెలబ్రిటీలు పరామర్శకు వెళ్తున్నారంటూ సీఎం రేవంత్ ప్రశ్నించారు. ఆ సెలబ్రిటీలు బాధిత కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదని నిలదీశారు. సినిమా వాళ్లను తాను ఒక్కటే కోరుతున్నానని.. మానవత్వం మర్చిపోవద్దన్నారు. పోలీసులు థియేటర్ యాజమాన్యంతో పాటు.. అల్లు అర్జున్‌పైనా కేసు పెట్టినట్లు సీఎం గుర్తు చేశారు.

Updated Date - Dec 21 , 2024 | 03:39 PM