ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Singareni: సింగరేణి కార్మికులకు దసరా బొనాంజా..

ABN, Publish Date - Sep 20 , 2024 | 09:59 PM

Singareni Employees: సింగరేణి కార్మికులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. భారీగా దసరా బోనస్ ప్రకటించింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు సైతం బోనస్ ప్రకటించింది ప్రభుత్వం. శుక్రవారం నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సంయుక్తంగా..

Singareni Employees

Singareni Employees: సింగరేణి కార్మికులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. భారీగా దసరా బోనస్ ప్రకటించింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు సైతం బోనస్ ప్రకటించింది ప్రభుత్వం. శుక్రవారం నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించి.. సింగరేణి కార్మికులకు బోనస్ ఇస్తున్నట్లు ప్రకటించారు.


ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం, డిప్యూటీ సీఎం.. ఒక్కో సింగరేణి కార్మికుడికి రూ. 1.90 లక్షలు బోనస్ ఇస్తున్నట్లు ప్రకటించారు. గత సంవత్సరం కంటే ఈ ఏడాది రూ. 20 వేలు అధికంగా ఇస్తున్నామన్నారు. చరిత్రలో మొట్టమొదటిసారి సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు రూ. 5 వేల బోనస్ ఇస్తున్నాం చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులది కీలక పాత్ర అని.. కార్మికుల కుటుంబాల్లో ఆనందం చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. కార్మికులకు మొత్తంగా రూ. 796 కోట్లు బోనస్‌గా ప్రకటిస్తున్నామని చెప్పారు. 2023-24 ఏడాదిలో సింగరేణి లాభాలు రూ. 4,701 కోట్లు అని వెల్లడించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. సింగరేణి లాభాల్లో వాటాను దసరా బోనస్‌గా కార్మికులకు ఇస్తున్నామని చెప్పారు.


రాష్ట్రానికి సింగరేణి తలమానికం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. 2023లో సింగరేణి 4701కోట్ల లాభం గడించిందని.. సింగరేణి విస్తరణకు రూ. 2,289 కొట్లు పెట్టుబడిగా పెట్టాలని నిర్ణయించామన్నారు. మిగిలిన రూ. 2,412 కోట్లను ఒక్కో కార్మికునికి రూ. 1.90 లక్షలు చొప్పున పంచాలని నిర్ణయించామన్నారు. 41,837 మంది కార్మికులు సింగరేణిలో పనిచేస్తున్నారని భట్టి చెప్పారు. అలాగే 25వేల మంది కాంట్రాక్టు కార్మికులు పని చేస్తున్నారని తెలిపారు. గతంలో ఎప్పుడు కాంట్రాక్టు ఉద్యోగులకు లాభాలు పంచలేదని.. మొదటిసారి కాంట్రాక్టు కార్మికులకు రూ. 5 వేలు చొప్పున పంచుతున్నామని భట్టి తెలిపారు.

Updated Date - Sep 20 , 2024 | 09:59 PM