TG News: అధికారులే మీ ఇంటికొస్తారు..
ABN, Publish Date - Aug 27 , 2024 | 11:51 AM
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రుణం అమలు కాని రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం యాప్ తీసుకొచ్చింది. అర్హత కలిగి రుణమాఫీ కాని వారి ఇళ్లకు వ్యవసాయ శాఖ అధికారులు వెళతారు. వారి ఇంటి వద్ద యాప్‌లో వివరాలు నమోదు చేస్తారు. ఈ రోజు నుంచి రుణమాఫీ అమలు కాని రైతుల ఇంటికి వ్యవసాయ సిబ్బంది వెళతారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీపై గందరగోళం నెలకొంది. కొన్నిచోట్ల బ్యాంకుల తప్పిదం వల్ల రుణమాఫీ జరగలేదు. మరికొన్ని చోట్ల అధికారుల మిస్టేక్స్ జరిగాయి. ఆ క్రమంలో రైతు భరోసా (Rythu Bharosa App) పేరుతో యాప్‌ను తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. యాప్ డిజైన్ ఆదివారం పూర్తి కాగా.. మంగళవారం (ఈ రోజు) నుంచి గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. యాప్‌కును క్షేత్రస్థాయి సిబ్బందికి పంపించి, అందులో వివరాలు ఎలా నమోదు చేయాలనే అంశంపై శిక్షణ కూడా ఇచ్చారు.
అందుబాటులోకి యాప్..
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రుణం అమలు కాని రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం యాప్ తీసుకొచ్చింది. అర్హత కలిగి రుణమాఫీ కాని వారి ఇళ్లకు వ్యవసాయ శాఖ అధికారులు వెళతారు. వారి ఇంటి వద్ద యాప్‌లో వివరాలు నమోదు చేస్తారు. ఈ రోజు నుంచి రుణమాఫీ అమలు కాని రైతుల ఇంటికి వ్యవసాయ సిబ్బంది వెళతారు.
తొలుత వారి ఇంటికే..
రుణమాఫీ కాలేదని పలువురు రైతులు అధికారులకు ఫిర్యాదు చేశారు. తొలుత వారి ఇంటికి వ్యవసాయ శాఖ సిబ్బంది వెళతారు. అక్కడ వారి రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఇతర డాక్యుమెంట్స్ పరిశీలిస్తారు. కుటుంబ సభ్యుల వివరాలు, ఫొటోలు కూడా తీసుకుంటారు. రుణమాఫీకి సంబంధించిన వివరాలు, ఫోన్ నంబర్ ధృవీకరణ పత్రం రూపొందిస్తారు. కుటుంబ యజమాని సంతకం తీసుకుంటారు. ఆ యజమాని రుణానికి సంబంధించి పంచాయతీ కార్యదర్శి ధృవీకరించాల్సి ఉంటుంది. అర్హులైన వారిని గుర్తించి రైతులకు రుణమాఫీ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.
కారణమిదే..?
కొందరు రైతులకు రుణమాఫీ ఎందుకు కాలేదనే అంశంపై ఉన్నతాధికారులు వివరించారు. రైతుల రేషన్ కార్డు లేకపోవడం, కుటుంబ వివరాలు సరిగా నమోదు కాలేదని పేర్కొన్నారు. ఆయా కారణాలతో రుణమాఫీ కాలేదని వివరించారు. ఆ క్రమంలో రైతుల ఇంటి వద్దకొచ్చి వివరాలు నమోదు చేసి, అర్హత ఉంటే రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇదికూడా చదవండి: Hyderabad: హైడ్రాకు ప్రజలందరూ మద్దతివ్వాలి
Read Latest Telangana News and National News
Updated Date - Aug 27 , 2024 | 11:51 AM