ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Power Supply: ఎంవోయూ చేసుకోవడం వల్లే నష్టం

ABN, Publish Date - Jun 18 , 2024 | 03:52 PM

ఛత్తీస్ గఢ్‌తో విద్యుత్ ఒప్పందం రాష్ట్ర ప్రభుత్వానికి భారీ నష్టం వాటిల్లిందని విద్యుత్ ఉద్యోగి రఘు అభిప్రాయ పడ్డారు. ఛత్తీస్ గఢ్ విద్యుత్ ఒప్పందానికి ఈఆర్సీ అనుమతి ఇవ్వలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రొవిజన్‌కు మాత్రమే అనుమతి ఇచ్చిందని స్పష్టం చేశారు. ప్రొవిజన్‌కు సవరణలు చేసి పంపాలని ఈఆర్సీ సూచించిందని వివరించారు.

telangana power

హైదరాబాద్: ఛత్తీస్ గఢ్‌తో విద్యుత్ ఒప్పందం రాష్ట్ర ప్రభుత్వానికి భారీ నష్టం వాటిల్లిందని విద్యుత్ ఉద్యోగి రఘు అభిప్రాయ పడ్డారు. ఛత్తీస్ గఢ్ విద్యుత్ ఒప్పందానికి ఈఆర్సీ అనుమతి ఇవ్వలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రొవిజన్‌కు మాత్రమే అనుమతి ఇచ్చిందని స్పష్టం చేశారు. ప్రొవిజన్‌కు సవరణలు చేసి పంపాలని ఈఆర్సీ సూచించిందని వివరించారు. ఏడేళ్లు గడిచిన గత ప్రభుత్వం సవరణలు చేయలేదు. అదేవిధంగా ఛత్తీస్ గఢ్ విద్యుత్ ఒప్పందం కాంపిటేటివ్ బిడ్డింగ్ రూపంలో జరగాల్సి ఉండేదని అభిప్రాయ పడ్డారు. అలా కాకుండా ఎంవోయూ చేసుకున్నారని వివరించారు. ఇలా చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రూ.2600 కోట్ల నష్టం జరిగిందని ప్రకటన చేశారు.


కానీ సరఫరా..!!

‘ఒప్పందం ప్రకారం ఛత్తీస్ గఢ్ విద్యుత్ సరఫరా చేయలేదు. వెయ్యి మెగావాట్ల కోసం ఒప్పందం జరిగింది. సరఫరా చేయలేదు, ఛత్తీస్ గఢ్‌లో మరో వెయ్యి అదనపు మెగావాట్ల విద్యుత్ సరఫరా కోసం ఒప్పందం జరిగింది. తప్పు జరిగిందని తర్వాత తెలిసింది. రద్దు చేయడం వీలు పడలేదు. ఇరు రాష్ట్రాల డిస్కంల ద్వారా ఒప్పందాలు ఎంవోయూ చేసుకున్నాయి. ఛత్తీస్ గఢ్ ఒప్పందం రెగ్యులేటరీ కమిషన్ ఆమోదం పొందలేదు. కాంపిటేటివ్ బిడ్డింగ్‌లో బీహెచ్ఈఎల్ 2013-2014లో 88 శాతం రేటింగ్ ఉంటే, తరువాత జీరోకు పడిపోయింది. బీహెచ్ఈఎల్ కాంపిటేటివ్ బిడ్డింగ్‌పై కాగ్ రిపోర్టు ఇచ్చింది అని’ రఘు తేల్చి చెప్పారు.


ప్రభుత్వ ఛాయిస్ కాదు

‘భద్రాద్రి థర్మల్ ప్లాంట్‌లో సబ్ క్రిటికల్ టెక్నాలజీ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఛాయిస్ కాదు. ఇండియా బుల్స్ కోసం సబ్ క్రిటికల్ టెక్నాలజీ మిషనరీ రూపొందించారు. ఇండియా బుల్స్‌తో ఒప్పందం రద్దు కావడంతో సబ్ క్రిటికల్ మిషనరీ నెలకొల్పారు. దాంతో జరిగే నష్టాన్ని 25 ఏళ్ల పాటు భరించాల్సి ఉంటుంది. గోదావరిలో వరదలు ఎక్కువైతే భద్రాద్రిపై ప్రభావం పడే అవకాశం ఉంది. సాంకేతికపర అంశాలను దృష్టిలోకి తీసుకోకుండా భద్రాద్రి నిర్మాణం చేయడం సరికాదు. యాద్రాద్రి పవర్ ప్లాంట్ లోకెషన్ వల్ల రవాణా ఛార్జీల భారం ఎక్కువ ఉంటుంది. పర్యావరణ అంశాలను లెక్క చేయకుండా భద్రాద్రి నిర్మాణం ప్రారంభించారు. కాంపిటేటివ్ బిడ్డింగ్‌తో రేటు తక్కువ అయ్యే అవకాశం ఉండేది. అప్పటి ప్రభుత్వం అలా చేయలేదు. 2016లో సమస్య గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లా. ఛత్తీస్ గఢ్‌తో విద్యుత్ ఒప్పందాలు, భద్రాద్రి, యాద్రాద్రి అంశాల పై తమ వద్ద ఉన్న సమాచారం జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌కు ఇచ్చాం. కమిషన్ ముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చాం అని’ రఘు స్పష్టం చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి..

Congress: బ్యాలెట్‌తోనే ఓటింగ్ జరగాలి: అద్దంకి దయాకర్

Updated Date - Jun 18 , 2024 | 04:11 PM

Advertising
Advertising