ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS Govt: గద్దర్ విషయంలో మాట నిలబెట్టుకున్న రేవంత్ సర్కార్.. గ్రీన్ సిగ్నల్

ABN, Publish Date - Jan 30 , 2024 | 03:56 PM

Telangana: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ప్రజాకవి గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానన్న రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ప్రజాయుద్ధ నౌక గద్దర్ విగ్రహ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

హైదరాబాద్, జనవరి 30: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ప్రజాకవి గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానన్న రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ప్రజాయుద్ధ నౌక గద్దర్ విగ్రహ (Gadda Statue) ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయాలని తెల్లాపూర్ మున్సిపాలిటీ చేసిన తీర్మానాన్ని హెచ్‌ఎండీఏ (HMDA) ఆమోదించింది. ఈ నేపథ్యంలో విగ్రహ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని కేటాయిస్తూ మంగళవారం నాడు రేవంత్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.


అన్నీ తానై చూసుకున్న రేవంత్...

ప్రజా యుద్ధ నౌకగా పేరుగడించిన గద్దర్ ఇటీవల అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణించిన సమయంలో రాజకీయ పార్టీలు స్పందించిన తీరు అప్పట్లో చర్చకు దారి తీశాయి. అయితే టీపీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్ రెడ్డి మాత్రం గద్దర్ అంతిమయాత్రలో అన్నీ తానై ముందుకు నడిపించారు. గద్దర్ మరణ వార్త తెలిసిన వెంటనే ఆస్పత్రికి చేరుకున్న రేవంత్.. భౌతికకాయాన్ని ఎల్బీస్టేడియంకు తరలించడం దగ్గర నుంచి అంతిమయాత్ర, అంత్యక్రియలు ఇలా అన్నింటిలో ముందుండి నిర్వహించారు. ప్రభుత్వ లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు జరిగినప్పటికీ.. అక్కడ అన్నీ చూసుకుంది మాత్రం రేవంత్ రెడ్డే. ఒక్కమాటలో చెప్పాలంటే గద్దర్‌ను కాంగ్రెస్ తన సొంతమనిషిలా చూసుకుని ఘనంగా వీడ్కోలు పలికింది.

చివరి కోరిక తీరేనా...

కాగా.. గద్దర్ తన కుమారుడు సూర్యను రాజకీయాల్లో తీసుకురావాలని ఎంతగానో ప్రయత్నించారు. అనుకున్నదే తడువుగా కుమారుడితో పాటు ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలను కలిసి ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. కొత్త పార్టీ పెట్టాలన్న ఆలోచనను కూడా పక్కన పెట్టి చివరి వరకు కాంగ్రెస్‌ పార్టీతో సత్సంబంధాలు కొనసాగించారు. అయితే కుమారుడిని రాజకీయాల్లో ఉన్నత స్థాయిలో చూడాలన్న కోరిక తీరకుండానే గద్దర్ ప్రాణాలు వదిలారు. గద్దర్ కోరికను నెరవేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. గద్దర్ కుటుంబానికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. కుమారుడికి బదులుగా గద్దర్ కుమార్తె వెన్నెలకు గత ఎన్నికల్లో హైదరాబాద్ కంటోన్మెంట్‌ టికెట్‌ను కాంగ్రెస్ కేటాయించింది. అయితే ఆ ఎన్నికల్లో వెన్నెల ఓటమిపాలయ్యారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 30 , 2024 | 04:35 PM

Advertising
Advertising