ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Telangana: నిర్మాణ రంగానికి పూర్తి సహకారం: వేం నరేందర్ రెడ్డి

ABN, Publish Date - May 29 , 2024 | 11:03 AM

రాష్ట్రంలో జెట్ స్పీడ్‌తో నిర్మాణ రంగ అభివృద్ధి(Construction Sector Development) జరగాలని ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి(Vem Narender Reddy) అన్నారు. జూబ్లీహిల్స్‌లోని(Jubilee Hills) జూబ్లీహిల్స్ క్లబ్‌లో(Jubilee Hills Club) మంగళవారం రాత్రి సైబరాబాద్ బిల్డర్స్ అసోసియేషన్ ఆవిర్భావ వేడుకలు జరిగాయి.

Cyberabad builders association

హైదరాబాద్, మే 29: రాష్ట్రంలో జెట్ స్పీడ్‌తో నిర్మాణ రంగ అభివృద్ధి(Construction Sector Development) జరగాలని ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి(Vem Narender Reddy) అన్నారు. జూబ్లీహిల్స్‌లోని(Jubilee Hills) జూబ్లీహిల్స్ క్లబ్‌లో(Jubilee Hills Club) మంగళవారం రాత్రి సైబరాబాద్ బిల్డర్స్ అసోసియేషన్(Cyberabad builders association) ఆవిర్భావ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఆయన.. బిల్డర్లనుద్దేశించి కీలక ప్రసంగం చేశారు. ప్రజలపై భారం పడకుండా రిజిస్ట్రేషన్ విలువ ఉండేలా చూస్తామని అన్నారు. భూముల విలువ పెంచాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. అలాగే, రీజినల్ రింగ్ రొడ్డును జాతీయ రహదారిగా గుర్తించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతోపాటు మూసి సుందరీకరణ పనులు ప్రారంభిస్తామని వేం నరేందర్ రెడ్డి చెప్పారు.

Also Read: మళ్లీ వెలుగుచూసిన వైసీపీ మూకల వికృత చేష్టలు..


సైబరాబాద్ ప్రాంతం దేశంలోనే ఒక విజనరితో ఉన్న ప్రాంతంగా రూపుదిద్దుకోవాలని వేం నరేందర్ రెడ్డి అన్నారు. దేశంలోనే సైబరాబాద్ ప్రాంతం పేరు సాధించేలా తీర్చిదిద్దాలన్నారు. గత ముఖ్యమంత్రులు రాజకీయాలకు అతీతంగా సైబరాబాద్ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో నిర్మాణ రంగానికి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. ప్రభుత్వం.. బిల్డర్ల సలహాలు, సూచనలు స్వీకరించి మార్పులు, చేర్పులు చేస్తుందన్నారు.

Also Read: మీ కళ్లు, బ్రెయిన్ ఎంతో షార్ప్ అయితే తప్ప.. ఈ ఫొటోలోని నాలుగో మనిషిని కనిపెట్టలేరు..


ఇదిలాఉంటే.. సైబరాబాద్ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉదయ్ శేఖర్, ప్రధాన కార్యదర్శిగా అరవింద ఘోష్ తదితరులు నియమితులయ్యారు. ఈ కార్యక్రమంలో అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అధ్యక్షుడు ఆర్.వి.ఆర్.వి ప్రసాద్, నరేడ్కో మాజీ అధ్యక్షుడు సునీల్ చంద్రా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అసోసియేషన్ ఆవిష్కరణతోపాటు, వెబ్‌సైట్‌ను, బ్రోచర్ ఆవిష్కరించారు.

For More Telangana News and Telugu News..

Updated Date - May 29 , 2024 | 11:03 AM

Advertising
Advertising