ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Telangana: తెలంగాణలో కార్పొరేషన్ పదవుల పంపకం..

ABN, Publish Date - Jul 08 , 2024 | 11:42 AM

తెలంగాణలో కార్పొరేషన్ల చైర్మన్ల నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. మొత్తం 35 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి..

హైదరాబాద్: దశాబ్దకాలంగా అధికారంలో లేక పదవులు పొందలేక, పనులు చేసుకోలేక అవస్థలు పడ్డ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు ఈ సారి రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో ఎన్నో ఆశలు పెంచుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా అందుకు తగ్గట్టే అధికారం చేపట్టిన నెల రోజుల్లో నామినేటెడ్‌ పదవుల భర్తీ దృష్టి సారించి.. 37 కార్పొరేషన్లకు చైర్మన్లను ఎంపిక చేశారు. వాస్తవానికి లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే అధిష్ఠానం అనుమతితో వారి నియామకాలకు అంతా సిద్ధం చేశారు. అయితే లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ రావడంతో కోడ్‌ అమల్లోకి వచ్చి.. ఆ నియామకాలకు సంబంధించి ఉత్తర్వుల జారీ ఆగిపోయింది. జులై-08న 35 కార్పొరేషన్ల చైర్మన్ల నియామకంపై జీవో విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల జారీ చేసింది.

జీవో వచ్చేసింది..

  • కార్పొరేషన్ల చైర్మన్ల నియామక జీవో విడుదల

  • 35 మంది చైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ

  • మార్చి 15న జీవో విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

  • ఎన్నికల కోడ్‌ దృష్ట్యా ఆగిన జీవో నేడు విడుదల

  • రెండు రోజుల్లో బాధ్యతలు స్వీకరించనున్న చైర్మన్లు

ఎవరికి ఏ పదవి..?

  • కో ఆపరేటివ్‌ ఆయిల్‌ సీడ్స్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌గా జంగా రాఘవరెడ్డి

  • మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ వైస్‌ చైర్మన్‌గా జబ్బార్‌

  • సంగీత నాటక అకాడమీ చైర్మన్‌గా అలేఖ్య పుంజాల

  • మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఈరవత్రి అనిల్‌

  • కూడా(KUDA) కార్పొరేషన్ చైర్మన్‌గా ఇనగాల వెంకట్రామిరెడ్డి

  • గ్రామీణ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా చల్లా నర్సింహారెడ్డి

  • టీఎస్‌ ఐఐసీ చైర్మన్‌గా జగ్గారెడ్డి భార్య నిర్మలా జగ్గారెడ్డి

  • ఫారెస్ట్‌ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా పొదెం వీరయ్య

  • ఆర్యవైశ్య కార్పొరేషన్‌ చైర్మన్‌గా కాల్వ సుజాత

  • పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా గురునాథ్‌రెడ్డి

  • ఆగ్రో పరిశ్రమల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా కాసుల బాలరాజు

  • విత్తనాభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌గా అన్వేష్‌రెడ్డి

  • రాష్ట్ర సహకార సంఘం చైర్మన్‌గా మానాల మోహన్‌రెడ్డి

  • గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్‌ చైర్మన్‌గా నాగేశ్వరరావు

  • ముదిరాజ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌

  • మత్స్యసహకార సమాఖ్య చైర్మన్‌గా మెట్టు సాయి కుమార్‌

  • గ్రంథాలయ పరిషత్‌ చైర్మన్‌గా రియాజ్‌

  • మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా శోభారాణి

  • దివ్యాంగుల కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌గా ఎం. వీరయ్య

  • బీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా నూతి శ్రీకాంత్‌

  • ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా ఎన్‌.ప్రీతం

  • ఎస్టీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా బెల్లయ్య నాయక్‌

  • గిరిజన కార్పొరేషన్‌ చైర్మన్‌గా కె. తిరుపతి

  • ఎంబీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా జైపాల్‌

  • కనీస వేతనాల సలహా బోర్డు చైర్మన్‌గా జనక్‌ ప్రసాద్‌

  • నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా విజయ్‌బాబు

  • స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌గా శివసేనారెడ్డి

  • వాణిజ్య ప్రోత్సాహక కార్పొరేషన్‌ చైర్మన్‌గా ప్రకాశ్‌రెడ్డి

  • సాంకేతిక సేవల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా మన్నె సతీష్‌

  • పట్టణ మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్‌గా చల్లా నరసింహారెడ్డి

  • శాతవాహన పట్టాణాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా కె.నరేందర్‌రెడ్డి

  • కాకతీయ పట్టాణాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా ఈ. వెంకటరామిరెడ్డి

  • రహదారి అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా మల్‌రెడ్డి రామిరెడ్డి

  • తెలంగాణ టూరిజం సంస్థ చైర్మన్‌గా పటేల్‌ రమేశ్‌రెడ్డి

  • తెలంగాణ ఫుడ్స్‌ చైర్మన్‌గా ఎం.పి. ఫహిమ్‌

నేడే బాధ్యతలు..!

  • నేడు బాధ్యతలు తీసుకోనున్న పలువురు కార్పొరేషన్ చైర్మన్లు

  • పలు కార్పోరేషన్లకు గతంలో ఛైర్మన్లను ప్రకటించిన ప్రభుత్వం

  • పలు కార్పోరేషన్‌లకు నేడు జీవో విడుదల చేసిన ప్రభుత్వం

  • మైనింగ్ కార్పోరేషన్ ఛైర్మన్‌గా నేడు భాధ్యతలు స్వీకరించనున్న ఈరవత్రి అనీల్

  • కూడా(KUDA) కార్పోరేషన్ ఛైర్మన్‌గా భాధ్యతలు స్వీకరించనున్న ఇనగాల వెంకట్రామిరెడ్డి

  • అర్బన్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్‌గా భాధ్యతలు స్వీకరించనున్న చల్లా నర్సింహారెడ్డి


Updated Date - Jul 08 , 2024 | 12:35 PM

Advertising
Advertising
<