ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Telangana: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఒంటిపూట బడులు ఎప్పటినుంచంటే..

ABN, Publish Date - Mar 03 , 2024 | 11:52 AM

Telangana Half Day Schools: మార్చి నెల ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు(Temperature) పెరిగిపోతుండటంతో జనాలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలోనే.. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ(Telangana Education Department) కీలక నిర్ణయం తీసుకుంది. ఒంటిపూట బడుల(Half Day Schools) నిర్వహణపై కీలక ప్రకటన చేసింది. ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్రంలో బడులు ఒక్కపూట మాత్రమే ఉంటాయి.

Telangana Half Day Schools

Telangana Half Day Schools: మార్చి నెల ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు(Temperature) పెరిగిపోతుండటంతో జనాలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలోనే.. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ(Telangana Education Department) కీలక నిర్ణయం తీసుకుంది. ఒంటిపూట బడుల(Half Day Schools) నిర్వహణపై కీలక ప్రకటన చేసింది. ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్రంలో బడులు ఒక్కపూట మాత్రమే ఉంటాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేట్‌ పాఠశాలల్లో మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్‌ 23వ తేదీ వరకు ఒక్కపూట బడులు ఉంటాయి.

టైమింగ్స్ ఇవే..

ప్రభుత్వ నిర్ణయం ప్రకారం.. ఒక్కపూట బడులు ప్రారంభమైన తరువాత ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు స్కూల్ ఉంటుంది. విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని 12:30 గంటలకు ఏర్పాటు చేశారు.

వారికి మాత్రం మధ్యాహ్నం బడులు..

ఇక్కడ మరో కీలక అప్‌డేట్ ఉంది. పదో తరగతి ఎగ్జామ్ సెంటర్ పడిన స్కూళ్లలో విద్యార్థులకు మధ్యాహ్నం సమయంలో బడి ఉంటుంది. ఎగ్జామ్ పూర్తయిన తరువాత.. విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తారు. విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేసిన తరువాత తరగతులను నిర్వహిస్తారు. పదో తరగతి పరీక్షలు పూర్తయిన తరువాత తిరిగి ఉదయం వేళ స్కూల్స్ నిర్వహిస్తారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 03 , 2024 | 11:52 AM

Advertising
Advertising