TG HighCourt: జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేత చేపట్టవద్దన్న హైకోర్ట్
ABN, Publish Date - Aug 21 , 2024 | 03:15 PM
Telangana: జన్వాడ ఫామ్‌హౌస్ కూల్చివేతను రేపటి (గురువారం) వరకు చేపట్టవద్దని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. జన్వాడ ఫౌంహౌస్ ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉండడంతో తమ కట్టడాలను హైడ్రా కూల్చే అవకాశం ఉందని ముందస్తుగా హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. జన్వాడ ఫాంహౌస్‌ను కూల్చవద్దంటూ బీఆర్‌ఎస్ నేత ప్రవీణ్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
హైదరాబాద్, ఆగస్టు 21: జన్వాడ ఫామ్‌హౌస్ కూల్చివేతను రేపటి (గురువారం) వరకు చేపట్టవద్దని తెలంగాణ హైకోర్టు (Telangana Highcourt) స్పష్టం చేసింది. జన్వాడ ఫౌంహౌస్ ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉండడంతో తమ కట్టడాలను హైడ్రా కూల్చే అవకాశం ఉందని ముందస్తుగా హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. జన్వాడ ఫాంహౌస్‌ను కూల్చవద్దంటూ బీఆర్‌ఎస్ నేత ప్రవీణ్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. హైడ్రా కూల్చకుండా స్టే ఇవ్వాలని న్యాయస్థానంలో ప్రవీణ్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.
Supreme Court: ఓటుకు నోటు కేసులో సీఎం చంద్రబాబుకి భారీ ఊరట..
ఈపిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరగింది. ఏ ప్రాతిపదికను హైడ్రాను ఏర్పాటు చేశారని.. హైడ్రా లీగల్ స్టేటస్ ఏంటని ఈ సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించింది. హైడ్రా విధివిధానాలు ఏమిటి అడిగింది. ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేయడం అభినందిస్తున్నాం.. కానీ హైడ్రా ఏర్పాటు , హైడ్రా కమిషనర్‌కు ఉన్న పరిధులు ఏమిటని ధర్మాసనం ప్రశ్నించింది. నిర్మాణాలకు ఒక ప్రభుత్వ శాఖనే అనుమతులు ఇస్తుందని.. మరో శాఖ కూల్చివేస్తుందని తెలిపింది. 20 సంవత్సరాల క్రితం కట్టుకున్న బిల్డింగ్‌ను హైడ్రా కమిషనర్ ఇప్పుడు కూలుస్తున్నారని హైకోర్టు పేర్కొంది.
హైడ్రా 111 జీవో పరిధిలోకి రాదని అడ్వకేట్ అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలియజేశారు. హైడ్రా పేరుతో హైడ్రామా క్రియేట్ చేస్తున్నారని పిటిషనర్ తరపున వాదనలు వినిపించారు. ఆగస్టు 14న కొంతమంది అధికారులు జన్వాడ ఫామ్ హౌస్‌కు వచ్చి కూల్చివేస్తామని బెదిరించారని.. ఇందులో వాటర్ వర్క్స్‌తో పాటు సివేజ్ బోర్డును పార్టీలుగా చేర్చలేదని పిటిషనర్ కోర్టుకు వెల్లడించారు. వాదనలు విన్న హైకోర్టు రేపటి (ఆగస్టు 22) వరకు జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేత చేపట్టవద్దని స్పష్టం చేసింది.
Tadipatri: ఏబీఎన్ జర్నలిస్టును కాల్చేస్తానన్న వైసీపీ నేత.. పోలీసులు ఏం చేశారో తెలుసా?
ఫామ్‌హౌస్‌పై కేటీఆర్ రియాక్షన్
జన్వాడ ఫామ్‌హౌస్‌పై బీఆర్‌ఎస్ వర్కిగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ‘‘నాకంటూ ఏ ఫామ్ హౌజ్ లేదు. నా మిత్రుని ఫామ్ హౌజ్ లీజుకు తీసుకున్న. గత కొన్ని నెలలుగా లీజులో ఉంటున్న. అక్కడ నిబంధనల ప్రకారం లేకపోతే నేనే దగ్గరుండి కూలకొట్టిస్తా. అక్కడ తప్పు ఉంటే ఆ భవనాలు కూలగొట్టండి. తప్పు జరిగితే కూల్చడానికి నేను కూడా సహకరిస్తా. దాంతో పాటు నాతో రండి కాంగ్రెస్ నేతల ఫామ్ హౌజ్‌లు చూపిస్తా. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కేవీపీ, మహేందర్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, మధు యాష్కీ ఫామ్ హౌజ్‌లు కూడా ఉన్నాయి.వాటిని కూడా కూల్చండి, రేవంత్ రెడ్డికి ఎక్కడ ఉందో కూడా చూపిస్తా’’ అంటూ కేటీఆర్ పేర్కొన్నారు.
Updated Date - Aug 21 , 2024 | 03:17 PM