TG High Court: కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు
ABN, Publish Date - Dec 27 , 2024 | 01:29 PM
Telangana: ఫార్ములా ఈరేస్ కేసులో కేటీఆర్ మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు పొడిగించింది. ఈనెల 31 వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయవద్దంటూ హైకోర్టు ఆదేశించింది.
హైదరాబాద్, డిసెంబర్ 27: ఫార్ములా ఈకార్ రేసింగ్ కేసులో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(Former Minister KTR) క్వాష్ పిటిషన్‌పై విచారణ తెలంగాణ హైకోర్టులో(Telangana highcourt) వాయిదా పడింది. కేటీఆర్‌ను ఈనెల 31 వరకు అరెస్ట్ చేయవద్దంటూ హైకోర్టు ఆదేశించింది. విచారణను డిసెంబర్ 31కి వాయిదా వేసింది. కాగా.. ఫార్ములా ఈరేస్ కేసుకు సంబంధించి ఇప్పటికే హైకోర్టు డిసెంబర్ 30 వరకు కేటీఆర్‌కు నాట్ టు అరెస్ట్ ఇచ్చిన విషయం తెలిసిందే. కేటీఆర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, అరెస్ట్ చేయవద్దని గత విచారణలో హైకోర్టు ఆదేశించింది. ఈరోజు (శుక్రవారం) ఫార్ములా ఈరేస్ కేసు హైకోర్టులో విచారణకు రాగా.. ఏసీబీ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. అలాగే ఏసీబీ మరో పిటిషన్ కూడా దాఖలు చేసింది. కేటీఆర్ నాట్ టు అరెస్ట్ ఆదేశాలను ఎత్తివేయాలని పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌కు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా కేటీఆర్, రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 31 వరకు వాయిదా వేసింది. ఇప్పటి వరకు 30 వరకు ఉన్న నాట్ టు అరెస్ట్‌ను.. మరొక్క రోజుకు హైకోర్టు ధర్మాసనం పొడిగించింది. ఈనెల 31న నాట్ టు అరెస్ట్ పిటిషన్‌పైన అలాగే ఫార్ములా ఈ రేసింగ్‌కు సంబంధించి నమోదైన కౌంటర్‌పై కూడా హైకోర్టు పూర్తి స్థాయిలో విచారణ జరపనుంది.
అర్జున్ కేసు.. నాంపల్లి కోర్టు కీలక ప్రకటన..
ఇప్పటి వరకు ఫార్ములా ఈరేస్ వ్యవహారానికి సంబంధించి సుదీర్ఘంగా వాదనలు వినిపించిన తర్వాత కేటీఆర్‌కు హైకోర్టు స్వల్ప ఊరటనిచ్చింది. అయితే దాన్ని కూడా ఎత్తివేయాలని, పూర్తి స్థాయిలో విచారణ జరపాలని ఏసీబీ పిటిషన్‌లో పేర్కొంది. ఈ సమయంలో కేటీఆర్‌కు బెయిల్ మంజూరు చేసినా, రిలీఫ్ ఇచ్చినా, నాట్ టు అరెస్ట్ ఇచ్చినా విచారణకు ఇబ్బందికర వాతావరణం ఉంటుందని ఏసీబీ వెల్లడించింది. నాట్ టు అరెస్ట్‌ను ఎత్తివేయాలని ఏసీబీ మరో పిటిషన్‌ను వేసింది. ఆ పిటిషన్‌కు సంబంధించి ప్రతివాదిగా కేటీఆర్‌ను చేర్చారు. దీంతో కేటీఆర్ కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. డిసెంబర్ 31న ఫార్ములా ఈ కార్ రేస్‌పై ప్రభుత్వం వేసిన పిటిషన్‌పైన వాదనలు కొనసాగుతాయి. అలాగే నాట్ టు అరెస్ట్‌పై కేటీఆర్ కౌంటర్ దాఖలు చేసిన తర్వాత వాదనలు జరుగనున్నాయి. ఈ రెండు అంశాలపై డిసెంబర్ 31న ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత తెలంగాణ హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
ఇవి కూడా చదవండి..
Read Latest Telangana News And Telugu News
Updated Date - Dec 27 , 2024 | 02:09 PM