Sridhar Babu: సిలికాన్ వ్యాలీ కన్నా అద్భుతంగా డ్రైవర్ లెస్ కారు జర్నీ: మంత్రి శ్రీధర్ బాబు
ABN, Publish Date - Aug 26 , 2024 | 05:25 PM
అమెరికాలో ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు పర్యటించారు. రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొచ్చేందుకు పర్యటన సాగింది. సిలికాన్ వ్యాలీలో సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు డ్రైవర్ లెస్ కారులో జర్నీ చేశారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి. ఆ తర్వాత ఈ రోజు కంది వర్సిటీలో డ్రైవర్ లెస్ కారులో మంత్రి శ్రీధర్ బాబు ప్రయాణించారు.
సంగారెడ్డి: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతుంది. డ్రైవర్ లెస్ కార్లు అందుబాటులోకి వచ్చాయి. అగ్రరాజ్యం అమెరికాలోఉన్నాయి. మిగతా దేశాల్లో క్రమంగా అందుబాటులోకి రానున్నాయి. కంది ఐఐటీ క్యాంపస్‌లో విద్యార్థులు డ్రైవర్ లెస్ కారును రూపొందించారు. ఆ కారులో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు (IT Minister Sridhar Babu) ప్రయాణించారు. కారులో ప్రయాణం మధురానుభూతి కలిగించిందని వివరించారు.
అద్భుతం డ్రైవర్ లెస్ కారు..
‘ఐఐటీ విద్యార్థులు రూపొందించిన డ్రైవర్ లెస్ కారు అద్భుతంగా ఉంది. సిలికాన్ వ్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి, నేను డ్రైవర్ లెస్ వెహికిల్‌లో ప్రయాణించాం. ఆ ప్రయాణం కంటే ఈ రోజు చేసిన జర్నీ అద్భుతమైన అనుభూతి కలిగించింది. తెలంగాణ రాష్ట్రంలో ఐఐటీ హైదరాబాద్ రూపొందించిన ఈ టెక్నాలజీ దేశానికి గర్వకారణంగా నిలుస్తోంది. ప్రయోగ దశలో ఉన్న టెక్నాలజీ త్వరలో ఆచరణలోకి రావాలని కోరుకుంటున్నా. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సేవలను అన్ని రంగాల్లో రావాలని అభిలషిస్తున్నా అని’ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.
అమెరికాలో జర్నీ.. కానీ
అమెరికాలో ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు పర్యటించారు. రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొచ్చేందుకు పర్యటన సాగింది. సిలికాన్ వ్యాలీలో సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు డ్రైవర్ లెస్ కారులో జర్నీ చేశారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి. ఆ తర్వాత ఈ రోజు కంది వర్సిటీలో డ్రైవర్ లెస్ కారులో మంత్రి శ్రీధర్ బాబు ప్రయాణించారు. మన విద్యార్థులు రూపొందించిన కారు అద్భుతంగా ఉందని ప్రశంసించారు. ఇక్కడ అద్భుత అనుభూతికి లోనయ్యానని వివరించారు.
ఇవి కూడా చదవండి
CM Revanth: సీఎం రేవంత్, మంత్రులపై మహేశ్వర రెడ్డి నిప్పులు
Kodandareddy: హైడ్రాపై ఎంఐఎం, బీఆర్‌ఎస్‌వి అడ్డగోలు విమర్శలు
Read Latest Telangana News And Telugu News
Updated Date - Aug 26 , 2024 | 05:54 PM