ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: సరదా మిగిల్చిన విషాదం.. కెనడాలో తెలంగాణ యువకుడు మృతి

ABN, Publish Date - Sep 16 , 2024 | 08:30 PM

సోదరుడి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకోవాలనుకున్న ఓ యువకుడు ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన కెనడాలో జరిగింది.

కెనడా: సోదరుడి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకోవాలనుకున్న ఓ యువకుడు ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన కెనడాలో జరిగింది. కెనడా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ మీర్‌పేట్‌కు చెందిన ప్రణీత్‌ కెనడాలో ఎంఎస్ చదువుతున్నాడు. తన సోదరుడి పుట్టిన రోజు సందర్భంగా స్నేహితులతో కలిసి టొరంటోలోని లేక్ క్లియర్‌లో ఈత కొట్టడానికి వెళ్లాడు. అయితే ప్రమాదవశాత్తూ నీటిలో మునిగిపోయాడు. స్నేహితులు అధికారులకు సమాచారం అందించగా.. వారు మృతదేహాన్ని బయటకు తీశారు. అప్పటికే అతను చనిపోవడంతో తీవ్ర విషాదం నిండింది.


శోకసంద్రంలో కుటుంబ సభ్యులు..

ప్రణీత్ మరణవార్తను మీర్‌పేటలో నివసిస్తున్న అతని తల్లిదండ్రులకు చేరవేశారు. విషయం తెలుసుకుని మృతుడి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. మృత‌దేహాన్ని వీలైనంత త్వరగా హైద‌రాబాద్‌కు తెప్పించాల‌ని ప్రభుత్వాన్ని వేడుకుంటోంది. ప్రణీత్ మృతితో మీర్‌పేట‌లో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.

For Latest News and National News click here

Updated Date - Sep 16 , 2024 | 08:30 PM

Advertising
Advertising