ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Dasara : ఆర్టీసీకి కాసుల పంట

ABN, Publish Date - Oct 22 , 2024 | 10:00 PM

బతుకమ్మ, దసరా పండగలను పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాలతోపాటు వివిధ ప్రాంతాలకు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్, జేబీఎస్, ఎల్బీ నగర్, ఉప్పల్, ఆరాంఘర్, కేపీహెచ్‌బీ, సంతోష్ నగర్ నుంచి పలు ప్రాంతాలకు బస్సులను నడిపింది.

హైదరాబాద్, అక్టోబర్ 22: దసరా, బతుకమ్మ పండగలు సందర్భంగా సంస్థకు భారీగా ఆదాయం వచ్చిందని తెలంగాణ ఆర్టీసీ ఉన్నతాధికారులు మంగళవారం హైదరాబాద్‌లో వెల్లడించారు. సంస్థకు రూ.307.16 కోట్ల మేర ఆదాయం వచ్చిందని తెలిపారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు 707.73 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారన్నారు. దాంతో పండగల వేళ.. సాధారణంగా నడిచే బస్సు సర్వీసులే కాకుండా.. అదనపు సర్వీసులను సైతం తెలంగాణ ఆర్టీసీ నడిపిందని చెప్పారు. దాదాపు 10,513 బస్సులను అదనంగా నడిపామని ఉన్నతాధికారులు వివరించారు.

Also Read: BiggBoss Season 8: గంగవ్వకు గుండెపోటు..

Also Read: Bengaluru: కూలిన భవనం.. ఒకరు మృతి.. శిథిలాల కింద కార్మికులు


బతుకమ్మ, దసరా పండగలను పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాలతోపాటు వివిధ ప్రాంతాలకు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్, జేబీఎస్, ఎల్బీ నగర్, ఉప్పల్, ఆరాంఘర్, కేపీహెచ్‌బీ, సంతోష్ నగర్ నుంచి పలు ప్రాంతాలకు బస్సులను నడిపింది.

Also Read: ఇవి తింటే.. జుట్టు ఊడదు..

Also Read: Viral Video: చిరుతపులిని కవ్వించారు.. అంతే.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?


అయితే ఈ పండగల సందర్బంగా భాగ్యనగరం నుంచి సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికులకు ఆర్టీసీ గట్టి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ పండగల సందర్భంగా నడుపుతున్న ప్రత్యేక బస్సుల్లో అదనంగా 25 శాతం ఛార్జీలు పెంచింది.

Also Read: Ramcharan: ఆర్టీవో కార్యాలయంలో మెగా పవర్ స్టార్ సందడి

Also Read: IRCTC: శబరిమల యాత్రకు ప్రత్యేక రైలు


హైదరాబాద్ నుంచి తెలంగాణతోపాటు ఏపీకి వెళ్లే బస్సులకు ఈ ఛార్జీలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. దీనిపై ప్రయాణికుల నుంచి తీవ్ర నిరసన అయితే వ్యక్తమైంది. ఇక పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలు ఆధార్ కార్డు చూపించి ఉచితంగా ప్రయాణం చేయవచ్చునని ఈ సందర్భంగా ఆర్టీసీ సూచించింది. ఇక దసరా పండగ శనివారం రావడంతో... గురు, శుక్రవారం హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు 3 వేల సర్వీసులను తెలంగాణ ఆర్టీసీ నడిపిన విషయం విధితమే. దీంతో పండగల వేళ.. ఆర్టీసీకి వందల కోట్ల ఆదాయం సమకూరినట్లు అయింది.

For Telangana News And Telugu News.

Updated Date - Oct 22 , 2024 | 10:30 PM